Telangana Journalist: పెరటిలోని అరటి సొంత వైద్యానికి పనికిరాదట. ఈ సామెత మాదిరిగానే తెలంగాణలో జర్నలిస్టుల బతుకులు ఉన్నాయి. కాదు కాదు ఘనత వహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో జర్నలిస్టులను అలా మార్చింది. ఇలా రాయడానికి కాస్త కటువుగా ఉన్నప్పటికీ తప్పడం లేదు.
రేవంత్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతోంది. ఈరోజు కూడా జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు లేవు. ప్రతి ఆరునెలలకు ఒకసారి రెన్యువల్ తోనే సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ఘనత వహించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. ఈ మధ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏకంగా 40 వేలకు పైగా విలేకరులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెబుతున్నారు.
అసలు ఆ లెక్క ఎక్కడిది.. ఎవరు లెక్కించారు.. మంత్రి గారికి ఎవరు చెప్పారు.. మంత్రి సంగతి అలా ఉంటే.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి మరో విధంగా ఉంది. అసలు ఆయనకు జర్నలిస్టుల బాధలు పట్టవు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కు ఒక సిపిఆర్ఓ ఉన్నారు. ఆయన పేరు మల్సూర్.. ఆయన ఏ మాత్రం పట్టించుకోడు. తన కేవలం మాజీ బ్యూరోక్రాట్ మాత్రమే. ఆయనకు జర్నలిస్టుల బాధలు తెలియదు. ఇక ఐ అండ్ పిఆర్ కమిషనర్ ప్రియాంక.. తనకు ఏమి పట్టదు.
వీరి నాయకత్వంలో జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పోయిలో పడ్డట్టయింది. స్పదితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టు కంటకుడిగా మారిపోయాడు. ఇప్పటికే ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి జర్నలిస్టుల నుంచి నిరసన వ్యక్తమౌతోంది. అలాంటప్పుడు కెసిఆర్ కు, రేవంత్ రెడ్డికి తేడా ఏముంది?
గుర్తింపు కార్డుల విషయంలో ఈరోజు కూడా ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు. సమగ్రమైన ఆరోగ్య కార్లు ఇస్తామని చెప్పారు.. చివరికి అది కూడా దిక్కులేదు. మంత్రి ఏకంగా 40 వేలకు పైగా గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. అసలు ఆ లెక్క ఆయనకు ఎవరు చెప్పారు? ఎవరు పాత్రికేయులను లెక్కించారు.. ఈ ఒక మాట చాలు సమాచార పౌర సంబంధాల శాఖ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి.
ఇప్పటికే గుర్తింపు కార్డుల దరఖాస్తు ప్రక్రియను సర్వ భ్రష్టం పట్టించారు. అందులో రకరకాల నిబంధనలు.. రకరకాల క్లాజులు.. చివరికి సివిల్స్ ఎగ్జామ్ లో కూడా ఇన్ని ఇబ్బందులు ఉండవు కావచ్చు.. సైట్ ఓపెన్ కాదు. ఒకవేళ ఓపెన్ అయినా సరే.. అందులో రకరకాల షరతులు.. ఫోటోలు అప్లోడ్ చేయాలంటే ఒక పరిమితి వరకే ఉండాలట. అంతకుమించితే తీసుకోదట.. అసలు ఆ సైట్ ఎవడు మైంటైన్ చేస్తున్నాడు.. అసలు ఈ విషయాన్ని ఐ ఎన్ పి ఆర్ వాళ్లు చూస్తున్నారా.. ఆ సైట్లో జర్నలిస్టు గుర్తింపు కార్డుకు అప్లై చేయాలంటే సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టే అని ఇటీవల ఓ పాత్రికేయ మిత్రుడు అన్నాడు. దానినిబట్టి ఆ సైట్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫ్రీలాన్స్ జర్నలిస్టుల కేటగిరీలో నిబంధనలు ఎలా ఉన్నాయంటే.. ఆ కాలంలను పకడ్బందీగా నింపినా సరే ఒక్కడికి గుర్తింపు కార్డు రాదు. అన్నట్టు ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన జీవోను తెలంగాణ జర్నలిస్టులు తూర్పార పట్టారు. దీంతో ప్రభుత్వం నాలుక కరుచుకుంది. సవరణ జీవో తీసుకొస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు దిద్దుబాటు లేదు. సవరణ జీవో అంతకంటే లేదు. ఇంత చూసిన తర్వాత.. ఈ దిక్కుమాలిన గుర్తింపు కార్డు ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? అని తెలంగాణ జర్నలిస్టులు కచ్చితంగా తీసుకుంటారు. ఆ తిట్లకు కచ్చితంగా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే కనీస స్పృహ లేని వారికి ఐ అండ్ పీ ఆర్ శాఖ అప్పగిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది.