Homeటాప్ స్టోరీస్Telangana Janasena leaders: తెలంగాణ జనసేన నాయకులు ఇచ్చి పడేశారు.. ప్రొ. నాగేశ్వర్ అభిమానులు ష్...

Telangana Janasena leaders: తెలంగాణ జనసేన నాయకులు ఇచ్చి పడేశారు.. ప్రొ. నాగేశ్వర్ అభిమానులు ష్ గప్ చుప్

Telangana Janasena leaders: అనవసరం ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి.. అనవసరమైన మాటలు మాట్లాడి.. పైగా యుద్దం ప్రారంభం.. ముగింపు అంటూ వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్. అంతే కాదు, కొంతమంది జర్నలిస్టులను వెంట పెట్టుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అక్కడ తనకు జరగుతున్న ఇబ్బందుల మీద, నమోదైన కేసుల మీద, ఇంకా తనకు ఎదురవుతున్న వేధింపుల మీద మాట్లాడాల్సిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. తనను విక్టిమ్ గా అక్కడ పరిచయం […]

Telangana Janasena leaders: అనవసరం ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి.. అనవసరమైన మాటలు మాట్లాడి.. పైగా యుద్దం ప్రారంభం.. ముగింపు అంటూ వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్. అంతే కాదు, కొంతమంది జర్నలిస్టులను వెంట పెట్టుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

అక్కడ తనకు జరగుతున్న ఇబ్బందుల మీద, నమోదైన కేసుల మీద, ఇంకా తనకు ఎదురవుతున్న వేధింపుల మీద మాట్లాడాల్సిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. తనను విక్టిమ్ గా అక్కడ పరిచయం చేసుకున్నారు. తన మీదకు ఆంధ్రా పోలీసులు వస్తున్నట్టు.. వారు దాడులు చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు. ఇక ఆయనకు వంత పాడే వారంతా స్థాయి మరిచి విమర్శలు చేశారు.

బక్కా జడ్సన్ , ప్రథ్వీ రాజ్ లాంటి వాళ్లయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుట్ర చేశారని, వారికి రేవంత్ వంత పాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వాళ్ల మీద ఆంధ్రా వాళ్లు కుట్ర చేస్తున్నారని, నాగేశ్వర్ భుజం మీద తుపాకీ పెట్టి తమ మీద ఫైరింగ్ చేస్తున్నారని.. ఇలా అడ్డగోలుగా మాట్లాడారు. చివరికి ఈ వ్యహారానికి ఆంధ్రా , తెలంగాణ సెంటిమెంట్ కూడా పూసేందుకు వెనుకాడ లేదు.

బక్కా జడ్సన్, ప్రథ్వీరాజ్ లాంటి వాళ్లు తమ స్థాయి మరిచి పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో తెలంగాణ జనసేన నాయకులు తెరమీదకు వచ్చారు. ఎక్కడయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ విలేకరుల సమావేశం పెట్టి జనసేన, టీడీపీ నాయకుల మీద విమర్శలు చేశాడో.. అక్కడే వారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుచరుల కంటే ఎక్కువ స్వరంతో విమర్శించారు.

‘మేమంతా ఎస్సీలమే, దళితులమే. తెలంగాణ ఉద్యమంలో ముందుభాగంలో నిలిచినవాళ్లమే. నిన్న ఏమో మాట్లాడిర్రు కదరా.. ఇప్పుడు మేమొచ్చినం. తెలంగాణ మీ సొత్తా, మీ జాగీరా, తొక్కి నార తీస్తం. ఏమోపీకుతామని అడ్డంపొడువు మాటలు మాట్లాడిర్రు కదరా.. ఇప్పుడు రండి’ అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. జన సేన నాయకులు కూడా సాలిడ్ కౌంటర్ ఇవ్వడంతో ఏం చేయలేని పరిస్థితి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుచరులకు ఏర్పడిందని, గత్యంతరం లేక వారు సైలెంట్ అయిపోయారని జనసేన నాయకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper