HomeతెలంగాణAkunuri Murali Resignation Reasons: నిన్న రెరా చైర్మన్ సత్యనారాయణ.. నేటి విద్యా కమిషన్ చైర్మన్...

Akunuri Murali Resignation Reasons: నిన్న రెరా చైర్మన్ సత్యనారాయణ.. నేటి విద్యా కమిషన్ చైర్మన్ మురళి.. ఎందుకు రాజీనామాలు చేశారు.. ఏం జరుగుతోంది..

Akunuri Murali Resignation Reasons: సాధారణంగా ప్రభుత్వంలో అధికారులు రాజీనామా చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. రాజీనామా కోణాన్ని మీడియా లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటుంది. అసలు విషయాన్ని బయటపడుతూ ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత ఆరోగ్యం బాగా లేకపోతే లేదా ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదురైతే అధికారులు రాజీనామా చేస్తారు. ఒక స్థాయి అధికారులకు ప్రభుత్వంలో అండదండలు బాగా ఉంటాయి. ముఖ్యమంత్రి స్థాయిలో పరిచయాలు ఉంటాయి కాబట్టి జీతభత్యాలు కూడా అంతకుమించి అనే స్థాయిలో ఉంటాయి. మంచి హోదా […]

Akunuri Murali Resignation Reasons: సాధారణంగా ప్రభుత్వంలో అధికారులు రాజీనామా చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. రాజీనామా కోణాన్ని మీడియా లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటుంది. అసలు విషయాన్ని బయటపడుతూ ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత ఆరోగ్యం బాగా లేకపోతే లేదా ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదురైతే అధికారులు రాజీనామా చేస్తారు. ఒక స్థాయి అధికారులకు ప్రభుత్వంలో అండదండలు బాగా ఉంటాయి. ముఖ్యమంత్రి స్థాయిలో పరిచయాలు ఉంటాయి కాబట్టి జీతభత్యాలు కూడా అంతకుమించి అనే స్థాయిలో ఉంటాయి. మంచి హోదా కూడా ఉంటుంది కాబట్టి అధికార దర్పాన్ని కూడా బ్రహ్మాండంగా అనుభవించవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ రాజీనామా చేశారంటే కచ్చితంగా అనుమానించాల్సిందే. పైగా సర్వీస్ కూడా ఉన్నప్పుడు ఇటువంటి రాజీనామా వ్యవహారాలను సాధారణంగా చూడకూడదు.

భారత రాష్ట్రపతి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో ఈ విషయం ఒక సంచలనం. ఆ తర్వాత ఆయన ఏపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యా కమిషన్ చైర్మన్గా పని చేశారు. అక్కడ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలలను అభివృద్ధి చేసి.. సరికొత్త సౌకర్యాలు కల్పించారు. డ్రాప్ అవుట్లు తగ్గేలా చూశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేశారు.. తద్వారా ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పెరిగాయి. విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించారు. అది నచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మురళికి విద్యా కమిషన్ చైర్మన్గా పదవి కల్పించారు. ఇది క్యాబినెట్ ర్యాంకు హోదా పదవి.

ఇటీవల తెలంగాణ విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పుల గురించి మురళి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. అందులో ప్రభుత్వ టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని పెంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పదవ తరగతి, ఇంటర్ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే పదో తరగతి విద్యను కాస్త ప్లస్ 2 గా మార్చి.. తమిళనాడు, కేరళ స్థాయిలో విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మురళి సమర్పించిన నివేదిక తెలంగాణ రాజకీయాలలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి మురళి నివేదికను నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టింది.. ఈ నివేదిక పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. మురళి నివేదిక వల్ల ప్రభుత్వ టీచర్లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన కలిగిందని సమాచారం. అప్పటినుంచి మురళి, ప్రభుత్వం మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ప్రచారం జరిగింది.

కొంతకాలంగా మురళి కూడా తన మీద వస్తున్న విమర్శల పట్ల నిరాశ లో ఉన్నారని తెలుస్తోంది. అందువల్లే ఆయన తన పదవికి శుక్రవారం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన పంపించారు.. మురళి కంటే ముందు రెరా చైర్మన్ సత్యనారాయణ కూడా తన పదవికి రాజీనామా చేశారు.. వాస్తవానికి రెరా అనేది అత్యంత డిమాండ్ ఉన్న విభాగం. ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి గుండెకాయ లాంటిది. ఈ పదవిలో సత్యనారాయణ ను రేవంత్ రెడ్డి ఏరికోరి నియమించారు. తనమీద ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గకుండా సత్యనారాయణ ను నియమించారు. కొంతకాలం పాటు ఆయన కూడా సక్రమంగానే పనిచేశారు. అయితే ఇటీవల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద గులాబీ పార్టీ నెగటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. సత్యనారాయణ మీద కూడా లేనిపోని ఆరోపణలు చేసింది. పైగా ప్రభుత్వ పెద్దల నుంచి అతడికి సహకారం అందకపోవడంతో.. కొన్ని వ్యవహారాలలో ఆయనను కలగజేసుకోకూడదని చెప్పడంతో.. తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేశారు. సత్యనారాయణ రాజీనామాను మర్చిపోకముందే.. ఆకునూరి మురళి రాజీనామా చేయడం.. సంచలనం కలిగిస్తోంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వివరణ ఇస్తుంది.. అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper