spot_img
Homeటాప్ స్టోరీస్Hyderabad commercial real estate : హైదరాబాద్.. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కింగ్.. ఎన్ని కోట్ల...

Hyderabad commercial real estate : హైదరాబాద్.. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో కింగ్.. ఎన్ని కోట్ల వ్యాపారమో తెలుసా

Hyderabad commercial real estate : ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడుతున్నాయి. ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. సాధ్యమైనంతవరకు మెరుగైన టెక్నాలజీతో.. తక్కువ మ్యాన్ పవర్ తో పనులు చేయించుకుంటున్నాయి. దీంతో కంపెనీల పెట్టుబడులు చాలా వరకు తగ్గిపోయాయి. కార్పొరేట్ ఆఫీస్ లీజు కూడా నేల చూపులు చూస్తోంది. ఇలాంటి సమయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది హైదరాబాద్.

కమర్షియల్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ కింగ్ లాగా దూసుకుపోతోంది. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో కార్యాలయాల స్థలాల లీజింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా లక్ష నుంచి పదిలక్షల విస్తీర్ణం వరకు విస్తీర్ణం ఉన్న కార్యాలయాలలో ఆయా సంస్థలు తమ పనులు మొదలుపెడుతున్నాయి. భారీ ధరకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్ నగరంలో 69% అభివృద్ధి నమోదయింది. గతంలో ఇది 40 శాతం వరకు ఉండేది. గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి లీజింగ్ జరిగింది.

ఈ సంవత్సరం ఈ సమయానికి 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి అది పెరిగింది. అదే కాదు గడిచిన మూడు నెలల్లో ఏకంగా 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల లావాదేవీలు జరిగాయి. ఇందులో భారీ కార్యాలయాల స్థలాల వాటా 75% గా ఉంది. ఇందులో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కార్యాలయాల వాటా 8 శాతం ఉంది. ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. మిడిల్ రేంజ్ లో కార్యాలయాల స్థలాలు 50వేల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశాయి. వీటి వాటా ఏకంగా 17 శాతం ఉంది. ఇక 10 లక్షల చదరపు అడుగుల లీజింగ్ భాగంలో కూడా ఒప్పందం కుదిరింది. దీని వాటా కూడా రెండు నుంచి మూడు శాతం వరకు ఉండే అవకాశం ఉంది.

ఇటీవల ఉబర్ కంపెనీ గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ విస్తరణ కోసం హైదరాబాద్ ఐటి కారిడార్ పరిధిలోని మీనాక్షి ఎకో పార్కులో ఏకంగా 9.1 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. జనవరిలో వీరుని లీజుకు తీసుకుంది. దాదాపు మొత్తం 10 అంతస్తులో ఈ సంస్థ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ప్రతి నెల దీనికి 5.86 కోట్ల అద్దె చెల్లిస్తోంది. చదరపు అడుగుకు 65 రూపాయల అద్దె చెల్లిస్తున్నట్టు సమాచారం. ప్రతి మూడు సంవత్సరాలకు 15% పెరుగుతుంది. పది సంవత్సరాలపాటు లీజు ఒప్పందం ఉంటుంది. మొత్తంగా 10 సంవత్సరాల వరకు చెల్లించే ఏకంగా 839 కోట్ల వరకు ఉంటుంది..

హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద లీజింగ్ ఒప్పందంలో ఇది ఒకటి. హైదరాబాద్ నగరంలో స్థలాలు విస్తీర్ణంగా ఉండడం.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు సాగించే అవకాశం ఉండడం.. ఐటీ రంగం.. ఫార్మా రంగం అద్భుతంగా ఉండడంతో ఫైనాన్స్.. మొబిలిటీ వంటి రంగాలలో దిగ్గజాలుగా ఉన్న సంస్థలు హైదరాబాద్ నగరం వైపు దృష్టిసారిస్తున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాదులో అద్దె తక్కువగా ఉంది. అందువల్లే కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper