Mahesh Babu Son Gautam Krishna Acting Skills: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి తను ఎదుగుతాడని అందరు అనుకున్నప్పటికి ప్రస్తుతానికైతే మహేష్ బాబు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమవుతున్నాడు. రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమాలను ఎందుకు చేశాడు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలనే ఉద్దేశ్యం తనకు లేదట. ఒకవేళ మనం బాలీవుడ్ లో సినిమాలు చేసిన కూడా అక్కడ ఉండే మాఫియా వల్ల అక్కడ సినిమాలకు ఇబ్బంది కలిగి అవకాశం ఉంటుంది. దానివల్ల మన మార్కెట్ ని కూడా మనం ఇక్కడ కోల్పోయే ప్రమాదమైతే ఉంది.
Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?
దానికోసమే ఆయన కేవలం తెలుగు ఇండస్ట్రీ మీదనే ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు కాబట్టి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కెరియర్ మొత్తం మారబోతున్నట్టుగా తెలుస్తుంది. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి.
వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన వారణాసి సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారే అవకాశాలైతే ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి…మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే అతనికి యాక్టింగ్ కోర్సులు కూడా నేర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక రాజమౌళి సైతం తన యాక్టింగ్ స్కిల్స్ చూసి ఫిదా అయిపోయారట. ఇక ఇండస్ట్రీ కి తన రాక ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు కానీ మొత్తానికైతే ఆయన మహేష్ బాబు మాదిరిగానే స్టార్ హీరోగా మారడానికి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
