HomeతెలంగాణMedigadda Barrage: మేడిగడ్డలో వద్ద మళ్లీ శబ్దాలు.. బ్యారేజీ భద్రతపై ఆందోళన!

Medigadda Barrage: మేడిగడ్డలో వద్ద మళ్లీ శబ్దాలు.. బ్యారేజీ భద్రతపై ఆందోళన!

Medigadda Barrage: తెలంగాణ ప్రాణంగా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగానే కుంగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి ఇదీ ఒక కారణం. బ్యారేజీలోని 7వ బ్లాక్‌ కుంగి దాదాపు పది నెలలు కావస్తోంది. ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు 7వ బ్లాక్‌ మరమ్మతులపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో కుంగిన గేట్లను ఎత్తే ప్రయత్నం చేస్తోంది.

16వ గేటు వద్ద శబ్దాలు..
తాజాగా బుధవారం 7వ బ్లాక్‌లోని 16వ నంబర్‌ గేటు ఎత్తు తుండగా భూగర్భంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. ప్రకంపనలు కూడా వచ్చాయి. దీంతో పనులు ఆపేశారు. పెద్ద శబ్దాల వెనుక ఏం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏడవ బ్లాక్‌ పియర్‌ కింద భారీ బుంగ పడి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దాని కారణంగానే గేటు ఎత్తుతుండగా శబ్దాలు వస్తున్నాయని భావిస్తున్నారు.

పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి..
గతంలో వచ్చిన వరదల కారణంగా బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయిందని బావిస్తున్నారు. దీనికారణంగా 12 వేల నుంచి 15 వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండొచ్చని జియో ఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షల ద్వారా అంచనావకు వచ్చారు. ఈ క్రమంలో టన్నులకొద్దీ బరువు ఉండే గేటు ఎత్తుతున్న క్రమంలో పునాదులపై ఒత్తిడి పడి శబ్దాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఖాళీలు పూడ్చాకే గేట్లు ఎత్తాలని..
ప్రస్తుత పరిస్థితిలో గేట్లు ఎత్తడం మంచిది కాదని ఇంజినీర్లు భావిస్తున్నారు. పునాదుల కింద ఏర్పడిన ఖాళీలు పూడ్చిన తర్వాతనే గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. ఇప్పటికే నీటి లీకేజీలను ఆపేందుకు బ్యారేజీ కుంగిన వెంటనే 40 వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా ఇప్పటికీ భారీ ఖాళీ ఉందని భావిస్తున్నారు.

పరీక్షలు చేయించడంపై దృష్టి..
మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడు నంబర్‌ బ్లాక్‌ దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని, మొత్తం బ్యారేజీ కింద ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుంది. మొదట ఖాళీ ప్రదేశం గుర్తించి దానిని పూడ్చిన తర్వాతనే మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. ఈమేరకు అవసరమైన పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper