HomeతెలంగాణBanswada Politics: రేవంత్ రెడ్డి ని తిట్టినా.. పోచారం శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసిన గులాబీ...

Banswada Politics: రేవంత్ రెడ్డి ని తిట్టినా.. పోచారం శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసిన గులాబీ నాయకులు.. బాన్సువాడలో ఏం జరుగుతోంది..

Banswada Politics: ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు గుర్తుందా. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. పెండింగ్ బిల్లుల కోసం.. సెగ్మెంట్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని.. కెసిఆర్ మెరుగైన అవకాశాలు ఇచ్చారని.. రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడ్డారని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆస్థాయిలో వ్యాఖ్యానించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయనను గులాబీ పార్టీలోకి తిరిగి రానిచ్చే ప్రసక్తి […]

Banswada Politics: ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు గుర్తుందా. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. పెండింగ్ బిల్లుల కోసం.. సెగ్మెంట్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని.. కెసిఆర్ మెరుగైన అవకాశాలు ఇచ్చారని.. రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడ్డారని వ్యాఖ్యానించారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆస్థాయిలో వ్యాఖ్యానించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయనను గులాబీ పార్టీలోకి తిరిగి రానిచ్చే ప్రసక్తి లేదని స్థానిక నాయకులు అంటున్నారు.. పైగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవల ఆయన సొంత నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన రాజకీయంగా సంచలనం కలిగించింది. ఇప్పుడు ఏకంగా ఆ ఘటనలో స్థానికంగా ఉన్న గులాబీ పార్టీ నాయకులు ఏకంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేశారు. దీంతో రాజకీయంగా కలకలం నెలకొంది.

ఇటీవల వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మైసమ్మ వెంకటేష్ అలియాస్ వెంకన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బక్క నారాయణకు.. వెంకటేష్ భూవివాదం కొనసాగుతోంది. సర్వే నెంబర్ లోని మోడల్ 92లో ఆరికరాల భూమిని వెంకటేష్ సాగు చేస్తున్నాడు. నారాయణ రెండు ఎకరాల్లో పంటలు పండిస్తున్నాడు. తనకు ఇంకా రెండు ఎకరాలు రావాలని నారాయణ.. అసలు సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని వెంకటేష్ చెబుతున్నాడు. ఇటీవల ఈ వ్యవహారం నారాయణ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అదేరోజు వీరిద్దరికి పొలం వద్ద గొడవ జరిగింది. నారాయణ తట్టుకోలేక గొడ్డలితో వెంకటేష్ నరికి చంపేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు పోలీసులకు లొంగిపోయాడు.

ఈ వ్యవహార వెనక బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడని పోచారం భాస్కర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు బాజిరెడ్డి గోవర్ధన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయం గులాబీ పార్టీ నేతలకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. వెంకటేష్ ను హత్య చేసిన నారాయణ పోచారం భాస్కర్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి అని గులాబీ పార్టీ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు. అంతేకాదు బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూ తగాదాల వల్ల ఘటన జరిగితే.. భాస్కర్ రెడ్డి గోవర్ధన్ మీద నిరాధర ఆరోపణలు చేస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు.. ఇక ఈ ఘటనతో పోచారం భాస్కర్ రెడ్డికి.. పోచారం శ్రీనివాస్ రెడ్డికి గులాబీ పార్టీ డోర్లు క్లోజ్ అయినట్టేనని.. కెసిఆర్ వారి విషయంలో క్షమించే ధోరణిలో లేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper