Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ను అన్ని విభాగాలలో కార్నర్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు బ్లాక్ టి షర్టులు ధరించిన గులాబీ నేతలు.. దానిమీద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసుకోవచ్చారు. ఇలాంటివి అసెంబ్లీలోకి అనుమతించేది లేదని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అక్కడ గొడవ మొదలైంది. ఆ తర్వాత తోపులాట చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షా గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
ఆ మరుసటి రోజు దళిత నాయకులు కెసిఆర్ ఫామ్హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ డప్పుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ నాయకులు పసుపు నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో రచ్చ రచ్చగా మారింది. దీనికి తోడు స్పీకర్, హరీష్ రావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో హరీష్ రావును ఉద్దేశించి స్పీకర్ ” అన్నది నీ తల్లిని కాదు.. నా తల్లిని” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే గులాబీ పార్టీ కాంగ్రెస్ తీరుపై అదే స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. గులాబీ పార్టీ కార్యాలయంలో మార్క్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. ఈ అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి గులాబీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారు. కొన్ని అంశాలను లేవనెత్తారు. దీనిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సబ్జెక్ట్ లేకుండా ఏదైనా మాట్లాడు.. సబ్జెక్టు మాట్లాడి సమాధానం చెప్ప అంటే ఎలా అంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు.. ముఖ్యమంత్రి ఆడుకుంటున్న చెడుగుడు వల్ల గులాబీ పార్టీ కాస్త ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో రూలింగ్ పార్టీ మీద ఈ విధంగా సెటైరికల్ రివెంజ్ తీర్చుకున్నది. కాకపోతే ఇటువంటి పరిణామాలు రాజకీయాలలో మంచివి కావని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించినప్పుడు.. అధికార పార్టీ తప్పులను అక్కడే నిలదీయాలని.. అలాకాకుండా మాకు అసెంబ్లీలు పెడితే ప్రయోజనం ఏముంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఇటువంటి వీడియోలు అనుకూల మీడియాలో.. సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ చేసుకోవడానికి తప్ప.. పెద్దగా ఉపయోగముండదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అధికార పార్టీని నిలదీయలేని దమ్ము లేనప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఉపయోగం ఏముందని.. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులను ఏ విధంగా అవమానించారో అందరికీ గుర్తుందని.. ఇప్పుడు ఆ అనుభవం గులాబీ పార్టీ నాయకులకు ఎదురు కాగానే మాకు అసెంబ్లీ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి గులాబీ నాయకులకు కౌంటర్గా కాంగ్రెస్ నేతలు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో చూడాల్సి ఉంది.
బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ.. సీఎంగా తలసాని
జగదీష్ రెడ్డి నువ్వు సబ్జెక్ట్ కాకుండా ఏదైనా మాట్లాడు.. సబ్జెక్ట్ మాట్లాడి ఆన్సర్ చెప్పమంటే ఎలా?
– మాక్ అసెంబ్లీలో సీఎం తలసాని pic.twitter.com/bpUD8ocpME
— Telugu Feed (@Telugufeedsite) September 12, 2026