HomeతెలంగాణTiger sightings in Telangana: అడవి లేదు.. ఆవాసం కూడా లేదు.. తెలంగాణలో పెద్దపులికి ఎంత...

Tiger sightings in Telangana: అడవి లేదు.. ఆవాసం కూడా లేదు.. తెలంగాణలో పెద్దపులికి ఎంత కష్టం?

Tiger sightings in Telangana: దట్టమైన వృక్షాలు. ఆకాశాన్ని తాకే విధంగా కొండలు.. గలగల పారే సెలయేర్లు.. అందులో రకరకాల జంతువులు.. ఫలితంగా జీవావరణం అద్భుతంగా ఉండేది. ప్రకృతి సమతుల్యం గొప్పగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అభివృద్ధి వల్ల చెట్లు నేల కూలిపోయాయి. కొండలు కరిగిపోయాయి. సెలయేర్లు కాలగర్భంలో కలిసిపోయాయి.

అడవిని నమ్ముకున్న జంతువులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. ఉన్న జంతువులు జనావాసాలాలో పడి కన్నుమూస్తున్నాయి. పెద్దపులి నుంచి మొదలు పెడితే జింకల వరకు ఇదే పరిస్థితి. కొన్ని సందర్భాలలో ఉన్న అడవుల్లో కూడా పులులకు ఆహారం దొరకడం లేదు. ఆహార అన్వేషణలో భాగంగా పులులు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వస్తున్నాయి. ఆ సమయంలో ఆహారం లభించక.. ఆవాసం దొరకక నరకం చూస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, జనగామ జిల్లాలలో మహారాష్ట్రలోని పాండవ ఖరా టైగర్ రిజర్వ్ నుంచి ఒక పులి వచ్చింది. ఈ పులి ముందుగా ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించి యాదాద్రి, జనగామ జిల్లాలలో ప్రవేశించింది. యాదాద్రి జిల్లాలోని కొలనుపాక ప్రాంతం నుంచి లింగాల గణపురం మండలం కుందారం గ్రామం శివారులోకి వచ్చింది. అక్కడ ఓ రైతుకు సంబంధించిన లేక దూడను చంపి తినేసింది. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో వారు పులి పాదముద్రలను పరిశీలించారు. అంతేకాదు ప్రజలకు సూచనలు చేశారు. రాత్రిపూట ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరించారు.

వాస్తవానికి ఈ ప్రాంతాల్లో పులి కనిపించక దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయింది. గతంలో ఈ ప్రాంతాలలో అడవులు విస్తారంగా ఉండేవి. కానీ, క్రమక్రమంగా అడవులు తగ్గిపోవడంతో పులులు కనుమరుగైపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పులులకు కూడా సరైన ఆవాసం, ఆహారం లభించకపోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. చివరికి ప్రాణాలు కోల్పోతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి పరిస్థితి కూడా ఇలానే ఉంది. అది ఆహార అన్వేషణ కోసం.. మనుగడ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం ఉండడం లేదు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper