Homeఎంటర్టైన్మెంట్Love story movies: లవ్ స్టోరీ లకు కాలం చెల్లిందా..? సక్సెస్ కొట్టాలంటే ఆ జానరే...

Love story movies: లవ్ స్టోరీ లకు కాలం చెల్లిందా..? సక్సెస్ కొట్టాలంటే ఆ జానరే బెస్టా..?

Love story movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరంలో చిన్న హీరోల దగ్గర వచ్చి పెద్ద హీరోల వరకు ప్రేమకథ సినిమాలను చేసేవారు. కానీ ఇప్పుడు లవ్ స్టోరీలకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. దానివల్ల స్టార్ హీరోలందరు యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే చిన్న హీరోలు థ్రిల్లర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా […]

Love story movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరంలో చిన్న హీరోల దగ్గర వచ్చి పెద్ద హీరోల వరకు ప్రేమకథ సినిమాలను చేసేవారు. కానీ ఇప్పుడు లవ్ స్టోరీలకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. దానివల్ల స్టార్ హీరోలందరు యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే చిన్న హీరోలు థ్రిల్లర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా థ్రిల్లర్ సినిమాలకి ఇప్పుడు తెలుగులో చాలా మంచి క్రేజ్ ఉంది… ప్రస్తుతం వస్తున్న ప్రతీ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు ఉండడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా సినిమాలు ఉంటున్నాయి.

ఇక దర్శకులు చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. అందువల్లే ఆయా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయనే చెప్పాలి…శేఖర్ కమ్ముల లాంటి లవ్ స్టోరీ సినిమాలను తెరకెక్కించే దర్శకుడు కూడా డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. దానివల్ల లవ్ స్టోరీలకు పెద్దగా ఆదరణ లేకుండా పోతుంది.

ఇక గౌతమ్ మీనన్ లాంటి దర్శకుడు సైతం రీసెంట్ గా మమ్ముట్టితో ‘డామిన్’ అనే థ్రిల్లర్ సినిమానైతే చేశాడు… ఇక ఏది ఏమైనా కూడా లవ్ స్టోరీస్ చేయాలంటే డిఫరెంట్ గా చెప్పాలి.అలాంటి సినిమాలే ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. ఇప్పుడు అంతకుమించిన డిఫరెంట్ కథలను చెప్పడం అనేది అసాధ్యం అనే చెప్పాలి.

ఎంత ప్రేమ కథ సినిమాలో అయిన లవర్స్ విడిపోవడం, మళ్లీ కలవడం తప్ప వేరే కొత్తగా పెద్ద అంశాలు ఏమీ ఉండవు. కాబట్టి అది బోరింగ్ ఎలిమెంట్ గా మారిపోయింది. దాని వల్లే అందరు డిఫరెంట్ జానర్ల వైపు అడుగులు వేస్తున్నారు… మరి ఇకమీదటైనా కొత్త లవ్ స్టోరీలతో సినిమాలను చేసే దర్శకులు ఉన్నారా? కొత్త దర్శకులు ఏదైనా మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper