HomeతెలంగాణNew ration cards in Telangana: పేదలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లో...

New ration cards in Telangana: పేదలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

New ration cards in Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు. తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ పాలించింది. అయితే తొమ్మిదిన్నరేళ్ల పాలనలో పేదలకు కొత్తగా రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. 2014 ముందు ఇచ్చిన రేషన్‌కార్డులే కొనసాగాయి. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ దీనిని ప్రచారాస్త్రంగా మార్చుకుంది. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ గెలుపులో ఇది కూడా కీలకంగా మారింది. ఇచ్చిన హామీ మేరకు గతేడాది జనవరి నుంచి రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి దర్యాప్తు చేసి కార్డులు జారీ చేస్తోంది. ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డును తప్పనిసరి చేయడంతో చాలా మంది దరాఖాస్తు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, పాతకార్డుల్లో సభ్యుల జోడింపు కూడా కొనసాగుతుందని తెలిపింది.

వేగవంతమైన పురోగతి
2025 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు ప్రభుత్వం కొత్తగా 14.40 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు చేసింది. దీంతో 2026 జనవరి నాటికి మొత్తం 1.04 కోట్ల (1,04,35,848) కార్డులు అయ్యాయి. అర్హత ఉండి రేషన్‌ కార్డు లేని అర్హులు ‘మీ సేవ’ కేంద్రాలకు ఎప్పుడైనా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు జోడించే విధానం కూడా అందుబాటులో ఉంది.

పేదల సంక్షేమ హామీ..
రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికను రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటోంది. కొత్త కార్డులు పొందినవారికి తక్కువ సమయంలో సరుకుల పంపిణీ ప్రారంభిస్తోంది.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్బ బోగస్‌ కార్డుల గుర్తింపు, ఆదాయ మించినవారిని తొలగించే చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్‌ స్థితి తెలుసుకోవడానికి epds.telangana.gov.in వెబ్‌సైట్‌ సహాయపడుతుంది. ఇది వ్యవస్థను మరింత సమర్థవంతం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper