HomeతెలంగాణModi Calls Revanth Follows: మోదీ పిలుపునిచ్చాడు.. రేవంత్ పాటించాడు.. ఇది అనూహ్యం

Modi Calls Revanth Follows: మోదీ పిలుపునిచ్చాడు.. రేవంత్ పాటించాడు.. ఇది అనూహ్యం

Modi Calls Revanth Follows: పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్‌ జల సంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఇప్పటికే ఇంధన ధరలు భారీగా పెంచాయి. క్యూబాలో అయితే లాక్‌డౌన్‌ ప్రకటించారు. భారత నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇవ్వడంతో తరచుగా నౌకలు వస్తున్నాయి. అయితే చమురు ధరలు పెరగడం, నిల్వలు తగ్గడంతో ప్రధారి మోదీ కూడా ఇంధన […]

Modi Calls Revanth Follows: పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్‌ జల సంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఇప్పటికే ఇంధన ధరలు భారీగా పెంచాయి. క్యూబాలో అయితే లాక్‌డౌన్‌ ప్రకటించారు. భారత నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇవ్వడంతో తరచుగా నౌకలు వస్తున్నాయి. అయితే చమురు ధరలు పెరగడం, నిల్వలు తగ్గడంతో ప్రధారి మోదీ కూడా ఇంధన పొదుపు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఇంధన ధరలు పెంచారు. మోదీ పిలుపు మేరకు చాలా రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్‌ తగ్గించుకున్నారు. పొందుపు మంత్రం పాటిస్తున్నారు.

తెలంగాణ సీఎం కూడా..
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినా ప్రధాని పిలుపు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్‌రెడ్డి కూడా తన అధికారిక కాన్వాయ్‌లో ముఖ్యమైన మార్పు చేశారు. ఇకపై నాలుగు వాహనాలతో మాత్రమే కాన్వాయ్‌ కదులుతుందని ప్రకటించారు. ఇంధన పొదుపు: ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, మంత్రులు తమ వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే సందేశం స్పష్టంగా ఉంది. సీఎం రేవంత్‌ ఈ సందేశానికి ఆచరణాత్మక రూపం ఇచ్చారు. కాన్వాయ్‌లో అధిక వాహనాలు ఉండటం వల్ల ట్రాఫిక్‌ జామ్, ప్రజల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను గుర్తించి సీఎం సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించాలని నిర్ణయించారు.

సీఎం నిర్ణయం వెనుక ప్రాధాన్యతలు…
ముఖ్యమంత్రి స్వయంగా ఉదాహరణగా నిలవడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మీద ప్రభావం చూపవచ్చు. ఇది ‘పైనుంచి కిందికి‘ మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. ప్రభుత్వ ఖజానాకు అదనపు భారం తగ్గడం, ఇంధన ఖర్చు తగ్గడం దీర్ఘకాలికంగా మంచి ఫలితాలనిస్తుంది. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద మొత్తంలో పొదుపు తెస్తాయి. ట్రాఫిక్‌ మధ్యనే ప్రయాణించడం ద్వారా సాధారణ ప్రజల జీవన విధానాన్ని ముఖ్యమంత్రి అనుభవించే అవకాశం ఏర్పడుతుంది. ఇది రాజకీయ నాయకులు – ప్రజల మధ్య దూరాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలులో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ముఖ్యంగా భద్రతా పరమైన అంశాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన కదలిక, ట్రాఫిక్‌ నిర్వహణలో పోలీసు బాధ్యతలు

నాయకత్వం నిజమైన పరీక్షకేవలం ప్రకటనలు కాకుండా వ్యక్తిగత స్థాయిలో మార్పు తీసుకురావడం రేవంత్‌ రెడ్డి నాయకత్వ శైలిలో భాగమని చెప్పవచ్చు. ఈ చిన్న అనుసరణ ఇతర రాష్ట్రాలు, అధికారులకు కూడా స్ఫూర్తినివ్వాలి. ఇంధన పొదుపు, ప్రజా సౌకర్యం, ప్రభుత్వ ఖర్చు తగ్గింపు వంటి అంశాల్లో ఈ నిర్ణయం సానుకూల ముద్ర వేస్తుందని ఆశించవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper