HomeతెలంగాణRevanth Reddy: ఇచ్చిన మాట కోసం... రేవంత్ రెడ్డి తొలి సంతకం దానిపైనే..

Revanth Reddy: ఇచ్చిన మాట కోసం… రేవంత్ రెడ్డి తొలి సంతకం దానిపైనే..

నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రజిని దివ్యాంగురాలు. ఈమె ఎంకాం పూర్తిచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు. దివ్యాంగురాలని ప్రైవేట్‌ సంస్థలూ అవకాశం ఇవ్వలేదు.

Revanth Reddy: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ సహా కాంగ్రెస్‌ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో ఓ దివ్యాంగ యువతికి కూడా తొలి ఉద్యోగం ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి ఉద్యోగం కల్పిస్తూ రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆ యువతికి ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు సమాచారం.

ఎవరీ దివ్యాంగురాలు..
నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రజిని దివ్యాంగురాలు. ఈమె ఎంకాం పూర్తిచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు. దివ్యాంగురాలని ప్రైవేట్‌ సంస్థలూ అవకాశం ఇవ్వలేదు. చివరి ప్రయత్నంగా ఎన్నికల సమయంలో గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. చలించిపోయినా రేవంత్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్‌ 9వ తేదీన ఏల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాలని రజినిని కోరారు. డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఖర్గేలు వస్తారని, ఆరోజు అక్కడకు రావాలని, అర్హత మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి ఉద్యోగాన్ని నీకే ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఆ యువతి కల నెలవేరనుంది. రేపు ఎల్బీ స్టేడియంలో దివ్యాంగ యువతి రజినికి ఉద్యోగం కల్పిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి సంతకం చేయనున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper