Homeలైఫ్ స్టైల్Children Care: పిల్లలతో పేరెంట్స్‌ ఈ విషయాలు మాట్లాడాలి..!

Children Care: పిల్లలతో పేరెంట్స్‌ ఈ విషయాలు మాట్లాడాలి..!

Children Care: సాధారణంగా చాలామంది పిల్లలు పేరెంట్స్‌ నుంచే అన్ని విషయాలు నేర్చుకుంటారు. పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువుగా భావిస్తారు. తల్లిదండ్రులు ఏ విధంగా మెదులుకుంటే పిల్లలు కూడా ఆ విధంగానే పెరుగుతారు. స్కూల్‌కు వెళ్లే సమయంలో గురువులను అనుకరిస్తారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో గ్యాప్‌ ఏర్పడుతుంది. అందుకే పిల్లలతో తల్లిదండ్రులు ఆ గ్యాప్‌ రాకుండా చూసుకోవాలి. చాలా సఖ్యతగా మెదులుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అలాంటి పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని విషయాలు తప్పనిసరిగా చర్చించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల వారు విజ్ఞానవంతులుగా తయారవుతారట.. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాధని వ్యక్తపరచడం..
చాలామంది పిల్లల తల్లిదండ్రులు పిల్లల ముందు వారికి వచ్చే కష్టాలను బాధను వ్యక్తపరచరు.. మా పిల్లలకి ఏమి తెలియకుండా పెంచుదామని అనుకుంటారు. పిల్లలు లేని సమయంలో భావోద్వేగానికి గురవుతారు. కానీ అలా చేయకూడదట. మీకు ఏ కష్టం వచ్చినా పిల్లల ముందు మన పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకోవడం మంచిదట. అలా చెప్పుకోవడం వల్ల మీకు మనశ్శాంతి కలగడమే కాకుండా పిల్లలకు కూడా అర్థమవుతుంది. వారికి ఏదైనా బాధ అనిపిస్తే డైరెక్ట్‌ గా వారు కూడా ఏడుస్తూ మీతో అలా చెబుతారట.

సమస్యలు..
ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరే చర్చించుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాత్రమే చర్చించుకోకూడదట. ఆ సమస్యను సాల్వ్‌ చేసుకోవడం కోసం పిల్లల ఆలోచన కూడా తీసుకోవాలట. ఆ సమస్య ఏంటో వారికి చెబితే వారి ఆలోచన కూడా చెబుతారని దీనివల్ల పిల్లలు కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి పెంచుకుంటారని అంటున్నారు నిపుణులు.

తప్పు చేసినప్పుడు..
తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇతరుల ముందు క్షమాపణ అడుగుతారు. అయితే ఈ సమయంలో పిల్లలు చూడకూడదనే భావన తల్లిదండ్రుల్లో ఉంటుంది. అలాకాకుండా పిల్లలముందే తప్పు చేశామని చెబుతూ ఎదుటివారికి క్షమించమని అడగాలి. ఇది పిల్లల ముందు చేయడం వల్ల వారు కూడా తప్పులు చేయకుండా తప్పు చేసిన క్షమించమని అడిగే భావన వారిలో కలుగుతుందట.

స్కూల్‌ విషయాలు..
ఇక పిల్లల ఇబ్బందులు తెలుసుకోవడానికి వారు పాఠశాలల్లో రోజువారీ కార్యక్రమాల గురించి తరచూ అడుగుతుండాలి. నిత్యం వారికి పాఠశాలలో చేసిన పనులు, టీచర్లు చెప్పిన మాటలు, సిలబస్, హోంవర్క్, ఫ్రెండ్స్‌ గురించి తదితర విషయాలపై నిత్యం మాట్లాడడం మంచిందట. అలా చేయకుంటే.. పిల్లలు తమను పేరెంట్స్‌ పట్టించుకోవడం లేదనే భావనలో ఉంటారట. ఫలితంగా గ్యాప్‌ పెరుగుతుందని, ఒంటరిగా ఉండడానికే పిల్లలు ఆసక్తి చూపుతారని నిపుణులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular