HomeతెలంగాణEtela Rajender: పెరిగిన ఈటల ఆస్తులు.. మొత్తం ఎంతో తెలుసా?

Etela Rajender: పెరిగిన ఈటల ఆస్తులు.. మొత్తం ఎంతో తెలుసా?

Etela Rajender: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌. ఈమేరకు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను కూడా సమర్పించారు. ఇందులో తన ఆస్తులు రూ.54.01 కోట్లుగా పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. తనపై 54 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. తన భార్య జమున పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక తన కుటుంబం పేరిట 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫాంలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నట్లు వివరించారు.

ఐదు నెలల్లో రూ.7 లక్షల పెరుగుదల..
ఇక ఈటల రాజేందర్‌ ఆస్తులు గడిచిన ఐదు నెలల్లో రూ.7 లక్షలు పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే 2023 నవంబర్‌లో హుజూరాబాద్, గజ్వేల్‌ నుంచి ఈటల నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను 53.94 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపీగా నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తి రూ.54.01గా పేర్కొన్నారు. అంటే ఐదు నెలల్లో రూ.7 లక్షల ఆదాయం పెరిగింది. ఇక కేసుల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40 కేసులు ఉన్నట్లు తెలుపగా, తాజాగా వాటి సంఖ్య 54కు పెరిగింది. స్థిరాస్తులు రూ.12.50 కోట్లు, చరాస్తులు రూ.16.74 లక్షలు ఉండగా, అప్పులు రూ.3.48 కోట్లుగా చూపించారు. తన భార్య పేరిట రూ.14.78 కోట్ల స్థిరాస్తులు, రూ.26.48 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తన భార్య పేరిట రూ.15.51 కోట్ల అప్పులు ఉన్నట్లు వివరించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper