Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ చిత్రం 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్. ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్. ఆర్థిక కష్టాల్లో ఉన్న పూరి జగన్నాధ్-ఛార్మిలను ఒడ్డున పడేసిన చిత్రం అది. ఉన్నదంతా ఊడ్చి ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని నిర్మించారు. ఇస్మార్ట్ శంకర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. హీరో రామ్ పోతినేని కి సైతం ఇస్మార్ట్ శంకర్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఆ చిత్రానికి పూరి జగన్నాధ్ సీక్వెల్ ప్లాన్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.
సంజయ్ దత్ ప్రధాన విలన్ గా నటించడం మరొక విశేషం. కావ్య థాపర్ హీరోయిన్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ తెలుగుతో పాటు హిందీలో విడుదల చేశారు. డబుల్ ఇస్మార్ట్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. చూసిన సినిమానే మరలా చూసినట్లు ఉందని ఆడియన్స్ అభిప్రాయం పడ్డారు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఓపెనింగ్స్ కూడా నిరాశాజనకంగా ఉన్నారు.
కాగా డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్ కి గురయ్యాయి. ఫస్ట్ డే ఈ మూవీ నార్త్ లో కేవలం రూ. 5 లక్షలు వసూలు చేసింది. ఐదు లక్షలు అంటే ముంబై లో ఉండే తెలుగువాళ్ళు కూడా పూర్తిగా ఈ సినిమాను పట్టించుకోలేదని చెప్పవచ్చు. ఇంత తక్కువ వసూళ్లు రావడానికి కారణం నెగిటివ్ టాక్ తో పాటు రామ్ పోతినేనికి హిందీలో మార్కెట్ లేకపోవడం. రామ్ పోతినేని చిత్రాలు యూట్యూబ్ లో సంచలనం చేశాయి.
యూట్యూబ్ లో విడుదలైన రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ చిత్రాలను మిలియన్స్ కొద్దీ చూశారు. కొన్ని అరుదైన రికార్డ్స్ కూడా యూట్యూబ్ లో రామ్ పోతినేని క్రియేట్ చేశారు. యూట్యూబ్ లో మన హిందీ చిత్రాలు చూశారు కాబట్టి, అక్కడ మనకు మార్కెట్ ఉంది అనుకుంటే పొరపాటే. ఇలా ఆలోచించే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోల్తా పడ్డాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు. హిందీ ఛత్రపతి భారీ బడ్జెట్ తో నిర్మిస్తే… పబ్లిసిటీకి ఖర్చు చేసినంత కూడా వసూలు చేయలేకపోయింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ మూవీస్ సైతం యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ సాధించాయి. ఆ విధంగా హిందీ ఆడియన్స్ లో నాకు గుర్తింపు ఉంది. థియేటర్స్ లో కూడా సినిమా చూస్తారని భ్రమపడి ఛత్రపతిని రీమేక్ చేశాడు. రామ్ పోతినేని ఇదే అపోహతో తన చిత్రాలు హిందీలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. రామ్ పోతినేని గత చిత్రం స్కంద సైతం హిందీలో విడుదలైంది. దాని పరిస్థితి కూడా సేమ్.
డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ రూ. 5 లక్షల వసూళ్లు ఫస్ట్ డే రాబట్టిన నేపథ్యంలో బాలీవుడ్ మీడియా టాలీవుడ్ ని ఎద్దేవా చేస్తుంది. కల్కి 2829 AD వంటి బ్లాక్ బస్టర్ అందించిన టాలీవుడ్ డబుల్ ఇస్మార్ట్ రూపంలో ఓ చెత్త సినిమాను బాలీవుడ్ మీదకు వదిలింది.. అని ట్రోల్ చేస్తున్నారు. అసలు డబుల్ ఇస్మార్ట్ హిందీలో విడుదల చేయడం అవసరమా అని ఎగతాళి చేస్తున్నారు.
Web Title: Ram pothineni starrer double ismart huge disaster in hindi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com