Puri Jagannadh : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. పూరి జగన్నాధ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ సైతం వరుస సినిమాలు చేస్తున్నప్పటికి అతనికి పాన్ ఇండియాలో పెద్దగా సక్సెసు లైతే దక్కడం లేదు. కారణం ఏదైనా కూడా ఆయన చేసే సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగితే తప్పకుండా సూపర్ సక్సెస్ ని సాధిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ (Puri Jagannad)… ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు వరుస విజయాలను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతనికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాయి. ఆయనకున్న క్రేజ్ మాత్రం ఎప్పుడు తగ్గడం లేదు. మరి ఆయన కాన్సెంట్రేట్ చేసి సినిమా చేస్తే మరో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటాడు అంటూ అతని అభిమానులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది అభిమానులైతే ఎప్పుడైతే ఛార్మి అతనితో పాటు కలిసి సినిమాలను నిర్మించడానికి సిద్ధమైందో అప్పటినుంచి పూరి జగన్నాధ్ మంచి సినిమాలను చేయడం తగ్గించేశాడు. సినిమాల మీద ఆయన పెద్దగా కాన్సెంట్రేట్ చేయడం లేదు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి మొత్తానికైతే పూరి జగన్నాధ్, ఛార్మి ఇద్దరు విడిపోతున్నారనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read : త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ల వల్లే స్టార్ హీరోలుగా మారి వాళ్ళకే హ్యాండ్ ఇచ్చిన హీరోలు…
నిజానికి వీళ్ళిద్దరి మధ్య కొన్ని క్లాశేష్ వచ్చినప్పటికి ఎప్పుడో విడిపోవాల్సింది కానీ బిజినెస్ పరంగా పూరి జగన్నాధ్ ఛార్మికి దాదాపు 150 కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉందట. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటికి తనే ప్రొడ్యూసర్ గా ఉండి ఫైనాన్సియర్స్ దగ్గర నుంచి డబ్బులను తీసుకొచ్చి పెట్టడంతో ఛార్మి కి పూరి జగన్నాథ్ భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంది. మరి ఆ మొత్తాన్ని చెల్లిస్తే ఛార్మి పూరి జగన్నాధ్ ఇద్దరు విడిపోతారు.
లేకపోతే మాత్రం మరికొన్ని రోజులు పాటు వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరికొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా పూరి జగన్నాధ్ ఒకప్పటి ఫామ్ ని అందుకొని మంచి సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంటే చూడాలని అతని అభిమానులు చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి తొందర్లోనే భారీ సక్సెస్ ని సాధిస్తాడా ఈసారి స్టార్ డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఆయన మరోసారి భారీ సక్సెస్ ని సాధించి మంచి కంబ్యాక్ ఇస్తే మాత్రం అతని అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు…
Also Read : హీరోయిన్ ఛార్మి తో రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టిన పూరి జగన్నాథ్..కారణం ఏమిటంటే!