Telangana RTC Smart Card: తెలంగాణలో 2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యాంరెంటీలు ప్రకటించింది. ఇందులో మహాలక్ష్మి పథకం ఒకటి. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితగా ప్రయాణం. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెండు రోజులకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. మొదటి పది రోజులు ఎలాంటి ఆధారం చూపకున్నా ఎలాంటి టికెట్ ఇవ్వకుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. తర్వాత తెలంగాణ మహిళలకే ప్రయాణం కల్పించేందుకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఆధార్ చూపించిన వారికే ఫ్రీ జర్నీ కొనసాగిస్తోంది. జీరో టికెట్ ఇష్యూ చేస్తోంది.
ఇక ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు జారీ చేయబోతోంది. దీంతో ఆధార్ లేకున్నా ఫ్రీ జర్నీ చేయవచ్చు. పౌరసర్ఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకుని, తొలి దశలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ కార్డులు పంపనుంది. 2026, జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుంది.
కార్డు పొందే ప్రక్రియ..
కార్డు లేని మహిళలు ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం చేయవచ్చు, కానీ స్మార్ట్ కార్డు కోసం బస్ పాస్ కేంద్రాలు, మీసేవ సెంటర్లు లేదా ఆర్టీసీ కౌంటర్లలో రూ.50 చెల్లించాలి. ఆధార్ స్కాన్ చేసి, ఫీజు చెల్లించడం, కార్డు ప్రింట్ అవ్వడం కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈ కార్డు డిజిటల్‌గా లింక్ అవుతుంది, ట్రాకింగ్ సులభం, మిస్ అయినా రీ–ఇష్యూ అవుతుంది. ఈ చిన్న ఫీజు కార్డు తయారీ, డేటా సెక్యూరిటీ ఖర్చులకు ఉపయోగపడుతుంది.
దశలవారీ అమలు ప్రణాళిక
మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ తొలి దశ మార్చి నుంచి మే వరకు తెల్ల రేషన్ కార్డు ధారకులకు ఆటోమేటిక్ జారీ అవుతుంది. రెండో దశలో మిగతా మహిళలకు ఆధార్ ఆధారంగా జారీ చేస్తుంది. జూన్ 2 నుంచి అన్ని జిల్లాల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో స్మార్ట్ కార్డు ద్వారానే ఫ్రీ జర్నీ అమలు చేస్తుంది.
ఎవరికి ప్రయోజనం..
ఈ విధానం గ్రామీణ, పట్టణ మహిళల ప్రయాణ ఖర్చులను పూర్తిగా తగ్గిస్తుంది. విద్య, ఉద్యోగాలు, వైద్యం సులభతరం చేస్తుంది. 2 కోట్లకు పైగా మహిళలు ప్రయోజనం పొందుతారు. ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది. అయితే రూ.50 ఫీజు పేదలకు భారం అవుతుంది. కార్డు జారీలో ఆలస్యం జరిగితే ఆధార్ మాత్రంతో రద్దీ పెరుగుతుంది. పోలీసులు, విద్యార్థులు, రోజువారీ కార్మికులకు పెద్ద ఊరట.
ఉచిత ప్రయాణంతో మహిళలపై ఏటా వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. కానీ ఇది ఎన్నికల హామీ కావడంతో అమలు చేయక తప్పని పరిస్థితి. దీంతో కొంత అయినా ఆదాయం పొందేలా స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.