Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhatsApp SIM Binding Rule India: వాట్సప్ వాడే వారందరికీ ఇదొక కీలక రూల్.. రేపటి...

WhatsApp SIM Binding Rule India: వాట్సప్ వాడే వారందరికీ ఇదొక కీలక రూల్.. రేపటి నుంచి అది తప్పనిసరి

WhatsApp SIM Binding Rule India: ప్రతి అవసరానికి మొబైల్ వాడకం పెరుగుతోంది. ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మోసాలను అరికట్టే వినియోగదారులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. మెసేజ్ యాప్ లో ప్రముఖంగా WhatsApp నిలుస్తోంది. చిన్న చిన్న మెసేజ్ నుంచి ముఖ్యమైన సమాచారం దీని ద్వారానే పంపించుకుంటున్నారు. అయితే వాట్సాప్ మొబైల్ తోపాటు డెస్క్ టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మొబైల్ […]

WhatsApp SIM Binding Rule India: ప్రతి అవసరానికి మొబైల్ వాడకం పెరుగుతోంది. ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మోసాలను అరికట్టే వినియోగదారులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. మెసేజ్ యాప్ లో ప్రముఖంగా WhatsApp నిలుస్తోంది. చిన్న చిన్న మెసేజ్ నుంచి ముఖ్యమైన సమాచారం దీని ద్వారానే పంపించుకుంటున్నారు. అయితే వాట్సాప్ మొబైల్ తోపాటు డెస్క్ టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మొబైల్ లో ఇప్పటివరకు సిమ్ లేకున్నా కూడా డెస్క్టాప్ లో వాట్సాప్ కనెక్ట్ అయ్యేది. కానీ ఇకనుంచి మొబైల్ లో ఫిజికల్ సిమ్ తప్పనిసరిగా ఉండాలని నిబంధన వచ్చింది. ఈ నిబంధన మార్చి ఒకటి నుంచి తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: అభిషేక్‌ పోస్ట్‌… చెప్పుతో యూవీ రిప్లై!

భారతదేశంలో మార్చి ఒకటి నుంచి అన్ని మెసేజింగ్ యాప్ లలో ఫిజికల్ సిమ్ ఉన్నప్పుడే మెసేజ్ పంపించుకోవడానికి ఆస్కారం ఉండాలనే నిబంధన మార్చి ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఈ నిబంధన లేకపోవడంతో చాలామంది మెసేజ్ లు పంపిస్తూ వినియోగదారులను ఇబ్బంది పెట్టేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం, టెలికాం నియంత్రణ సంస్థలు ఇకనుంచి మెసేజ్ యాప్ లపై నిఘా వేయనున్నారు. దీనినే సిమ్ బైండింగ్ అంటారు. అసలు ఈ సిమ్ బైండింగ్ అంటే ఏమిటంటే..? మొబైల్ లో కచ్చితంగా ఫిజికల్ సిమ్ ఉండాలి. వీటి ఆధారంగానే మెసేజ్ యాప్ లు పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక మొబైల్ లో వాట్సాప్ వాడినట్లయితే.. అకౌంట్ ఇంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ తో కనెక్టు ఉన్న సిమ్ కార్డు ఫోన్లో తప్పనిసరిగా ఉండాలి. అలా లేకపోతే ఆ యాప్ పనిచేయదు. ఒకవేళ ఆ సీన్ తీసేస్తే వెంటనే మెసేజ్ యాప్ ఆటోమేటిగ్గా లాగౌట్ అవుతుంది..

అంతేకాకుండా ఒక మెసేజ్ యాప్ డెస్క్ టాప్ లో లాగిన్ అయినప్పుడు.. ఆరు గంటల తర్వాత ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ మొబైల్ లో ఉన్న సిమ్ ఆధారంగా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్ కాల్స్, రాడ్ కాల్స్ వచ్చి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు మెసేజ్ యాప్ లు లాగౌట్ అయితే సిమ్ ట్రాక్ చేయడం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా ఈ కొత్త రూల్స్ ఫుల్ లాంగ్వేజ్ ఇస్తే టెలికాం యాక్ట్ 2023 ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు మార్చి ఒకటి నుంచి తప్పనిసరిగా అమలు చేయనున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper