Homeబిజినెస్iPhone 17: 53,817 కే సొంతం చేసుకోవచ్చు.. ఎక్కడ.. ఎందులోనంటే..

iPhone 17: 53,817 కే సొంతం చేసుకోవచ్చు.. ఎక్కడ.. ఎందులోనంటే..

iPhone 17: ప్రపంచంలో ఏ ఫోన్ల ధర తగ్గినా సరే.. ఐఫోన్ ధర మాత్రం స్థిరంగా ఉంటుంది. పైగా ఆపిల్ ఈ ఫోన్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఏడాది అద్భుతమైన ఫీచర్లను జోడిస్తూ ఉంటుంది. అందువల్లే ఐఫోన్ల ధర విపరీతంగా ఉంటుంది. ప్రీమియం కస్టమర్లను టార్గెట్ చేసుకుంటూ ఆపిల్ కంపెనీ ఐఫోన్లను తయారు చేస్తూ ఉంటుంది. ఆపిల్ కంపెనీ తయారుచేసిన ఏ ఐఫోన్ సిరీస్ అయినా సరే ధర తగ్గదు. కాకపోతే కొన్ని […]

iPhone 17: ప్రపంచంలో ఏ ఫోన్ల ధర తగ్గినా సరే.. ఐఫోన్ ధర మాత్రం స్థిరంగా ఉంటుంది. పైగా ఆపిల్ ఈ ఫోన్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఏడాది అద్భుతమైన ఫీచర్లను జోడిస్తూ ఉంటుంది. అందువల్లే ఐఫోన్ల ధర విపరీతంగా ఉంటుంది. ప్రీమియం కస్టమర్లను టార్గెట్ చేసుకుంటూ ఆపిల్ కంపెనీ ఐఫోన్లను తయారు చేస్తూ ఉంటుంది.

ఆపిల్ కంపెనీ తయారుచేసిన ఏ ఐఫోన్ సిరీస్ అయినా సరే ధర తగ్గదు. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ఆపిల్ కంపెనీ ఆఫర్ ప్రకటిస్తూ ఉంటుంది. ధరను కొంతలో కొంత తగ్గిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అదికూడా 17 సిరీస్ ఫోన్లపై తిరుగులేని డిస్కౌంట్ ఇచ్చింది. డిస్కౌంట్ భారీగా ఉన్నప్పటికీ.. ఆ తక్కువ ధరకు ఫోన్ సొంతం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఆపిల్ కంపెనీ ప్రకటించిన షరతులకు లోబడి ఉంటేనే డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 17 మోడల్ అసలు ధర 82,900. ఫ్లిప్కార్ట్ లో దీనిపై 2000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. 80,900 ఖరారు చేసింది.

ఎంపిటి చేసిన ఈ ఎస్బిఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 4833 వరకు ఇనిస్టాండ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా ఈ ఫోన్ ధర 76,067 కు తగ్గిపోతుంది.

ఐఫోన్ 13 (128gb).. ఈ ఫోన్ కనుక అద్భుతమైన కండిషన్లో ఉంటే దానికి గరిష్టంగా 22,260 వరకు ఎక్స్చేంజ్ విలువ లభిస్తుంది. ఈ మూడు ఆఫర్లను (రెండు వేల తగ్గింపు+ బ్యాంక్ ఆఫర్+ ఎక్స్చేంజి బోనస్) కలిపిన తర్వాత ఐఫోన్ ఎఫెక్టివ్ ధర 53,817 అవుతుంది. ఒకవేళ మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయకపోతే బ్యాంక్ ఆఫర్ తో కలిపి ఇది కేవలం 76,000 లభిస్తుంది.

ప్రతి ఏడాది కొత్త సిరీస్ లు అందుబాటులో తీసుకొచ్చినప్పటికీ ఐఫోన్లకు గిరాకీ ఏ మాత్రం తగ్గదు. పైగా యూత్ ఈ ఫోన్లను స్టేటస్ సింబల్గా భావిస్తూ ఉంటారు. ఎలైట్ పీపుల్ ఐఫోన్ కొత్త సిరీస్ చేతిలో ఉండడాన్ని గర్వంగా భావిస్తుంటారు. అందువల్లే ఈ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా గిరాకీ ఉంటుంది. పోటీలో ఏ సంస్థలు ఉన్నప్పటికీ.. ఎన్ని రకాల మోడల్స్ తీసుకొచ్చినప్పటికీ ఐఫోన్ కు గిరాకీ ఏమాత్రం తగ్గదు.

ఐ ఫోన్ లో ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. కెమెరా క్వాలిటీ ఒక రేంజ్ లో ఉంటుంది. కొంతమంది ఔత్సాహిక వ్యక్తులు ఐఫోన్ ద్వారానే వీడియోలు రికార్డు చేసి.. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు.. వాటిని యూట్యూబ్లోకి ఎక్కించి సంచలనాలు సృష్టించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper