Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi success story: వైభవ్ సూర్యవంశీ.. ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగిపోయాడు

Vaibhav Suryavanshi success story: వైభవ్ సూర్యవంశీ.. ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగిపోయాడు

Vaibhav Suryavanshi success story: ఆ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వచ్చారు. ఆయనను చూడగానే వైభవ్ సూర్యవంశీ మరోమాటకు తావు లేకుండా పాదాలకు నమస్కరించారు. ముగ్ధుడైపోయిన సునీల్ గవాస్కర్ అతడిని తన చేతులతో పైకి లేపి లగేరహో భేటా అంటూ ఆశీర్వదించారు. వైభవ్ సూర్యవంశీలో ఈ గుణమే ఇప్పుడు […]

Vaibhav Suryavanshi success story: ఆ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వచ్చారు. ఆయనను చూడగానే వైభవ్ సూర్యవంశీ మరోమాటకు తావు లేకుండా పాదాలకు నమస్కరించారు. ముగ్ధుడైపోయిన సునీల్ గవాస్కర్ అతడిని తన చేతులతో పైకి లేపి లగేరహో భేటా అంటూ ఆశీర్వదించారు.

వైభవ్ సూర్యవంశీలో ఈ గుణమే ఇప్పుడు అందరికీ నచ్చుతోంది. ధోని నుంచి విరాట్ వరకు అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు. సెహ్వాగ్ అయితే ఏకంగా తాను ఒక ఫ్రాంఛైజీ కి ఓనర్ అయితే అతడికి ఏకంగా 30 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. ఇంత వరకు ప్రపంచ లీగ్ చరిత్రలో ఏ ఆటగాడికి కూడా ఆ స్థాయిలో ధర లభించలేదు. సెహ్వాగ్ మాటలను బట్టి సూర్యవంశీ ఆట తీరు. అతడి కి పెరిగిన మార్కెట్, అతడి వ్యాల్యూ అర్థం చేసుకోవచ్చు.

మైదానం ప్రత్యర్థి బౌలర్ల మీద సూర్యవంశీ విరుచుకుపడతాడు. దయాదాక్షిణ్యం లేకుండా కొట్టేస్తుంటాడు. అతడి ఆటతీరు చూస్తుంటే తోపు బౌలర్లకు సైతం చెమటలు పడుతుంటాయి. గుజరాత్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సూర్యవంశీ ఒక్కడే జట్టు భారాన్ని మోసిన తీరు..అతడు ఒక్కడే అన్ని పరుగులు చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.

మైదానంలో వీరవిహారంచేసే వైభవ్ సూర్యవంశీ..పెద్దలతో మాత్రం గొప్పగా నడుచుకుంటాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీపడ్డారు. ఇందులో ప్రముఖులు కూడా ఉన్నారు. వారందరి దగ్గరనుంచి సూర్యవంశీ ఆశీర్వాదం తీసుకున్నాడు. అతడి ముఖంలో అసహనం కనిపించలేదు. చిరాకు కనిపించలేదు. ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని సూర్యవంశీ నిరూపించాడు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper