Homeక్రీడలుక్రికెట్‌Sunrisers Hyderabad Bowling: బ్యాటింగే కాదు.. బౌలింగ్ లోనూ వైల్డ్ ఫైరే.. ఇది SRH 2.0

Sunrisers Hyderabad Bowling: బ్యాటింగే కాదు.. బౌలింగ్ లోనూ వైల్డ్ ఫైరే.. ఇది SRH 2.0

Sunrisers Hyderabad Bowling: ఈ ఐపీఎల్ ప్రారంభంలో తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో హైదరాబాద్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసి 201 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దీనికి కారణం బౌలింగ్ లోపం. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 219 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం బౌలింగ్ లోపం. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో 226 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విజయవంతమైనప్పటికీ.. అదే ధోరణి హైదరాబాద్ జట్టు మిగతా మ్యాచ్లో కొనసాగించలేకపోయింది.

ఎప్పుడైతే పరుగులు అదే పనిగా ఇస్తున్న బౌలర్లను పక్కనపెట్టిన హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్.. కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు రాత మొత్తం మారిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 216 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. రాజస్థాన్ జట్టును 159 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో 194 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. చెన్నై జట్టును 184 పరుగులకు కట్టడి చేసింది.

ఎప్పుడైతే రాజస్థాన్ జట్టులోకి హుస్సేన్, ప్రఫుల్ వచ్చారో.. అప్పుడే కథ మొత్తం మారిపోయింది.. వారిద్దరు హైదరాబాద్ బౌలింగ్ గతిని మొత్తం మార్చేశారు. ఇప్పుడు వారికి తోడుగా మలింగ వచ్చేసాడు. వీరంతా కూడా హైదరాబాద్ జట్టు బౌలింగ్ స్థాయిని మరో లెవెల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా స్లో బాల్స్, బౌన్సర్లు వేస్తూ అదరగొడుతున్నారు. అందువల్లే హైదరాబాద్ జట్టు వరుసగా మూడు మ్యాచ్లు గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. ఒక దశలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన తర్వాత.. హైదరాబాద్ జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంది. దీంతో ఆ జట్టు పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఒక్కసారిగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. ఫలితంగా సమర్థవంతమైన బౌలర్లు జట్టులోకి వచ్చి చేరారు. దీంతో జట్టు రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి.

వాస్తవానికి హైదరాబాద్ జట్టు బలం మొత్తం బ్యాటింగ్ లోనే ఉంటుంది. కానీ గత మూడు మ్యాచ్లుగా హైదరాబాద్ బ్యాటింగ్ మాత్రమే కాదు.. బౌలింగ్ లోనూ అదరగొడుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ జట్టు బౌలింగ్లో సత్తా చూపించేది. కానీ బ్యాటింగ్ మీద మాత్రమే ఫోకస్ చేయడంతో బౌలింగ్ మొత్తం బలహీనంగా మారిపోయింది. ఈ దశలో హైదరాబాద్ మేనేజ్మెంట్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టడంతో పరిస్థితి మారిపోయింది. అందువల్లే హైదరాబాద్ జట్టు సత్తా చూపిస్తోంది. రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ జట్లను ఓడించి హైదరాబాద్ బౌలర్లు తమ స్థాయి ఏమిటో నిరూపించారు. బౌలింగ్ మీద హైదరాబాద్ మేనేజ్మెంట్ విపరీతంగా ఫోకస్ చేయడం వల్ల ఇటువంటి రిజల్ట్ వస్తోంది. అయితే ఇకపై జరగబోయే మ్యాచ్లలో కూడా బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే గనుక జరిగితే హైదరాబాద్ జట్టుకు తిరుగుండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular