India Russia Missile Deal: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ సైనిక శక్తి ఫెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సైనిక బడ్జెట్‌ను కూడా భారీగా పెంచింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా సరికొత్త ఆయుధాలు రూపొందిస్తోంది. దిగుమతులు తగ్గించింది. అయితే తాజాగా రష్యా నుంచి అతి దీర్ఘ శ్రేణి క్షిపణులు ఆర్–37ఎంలను కొనుగోలు చేసింది. ఇవి పాకిస్తాన్, చైనాపై ఏకకాలంలో దాడిచేసే సామర్థ్యం ఉన్నాయి.
క్షిపణి సాంకేతికత
ఆర్–37ఎం (AA-13 Axehead) మాచ్–6 వేగం, 300–400 కి.మీ. పరిధి కలిగిన హైపర్‌సోనిక్ బీవీఆర్ క్షిపణి, 510–600 కేజీల బరువు, 60 కేజీల ఫ్రాగ్‌మెంటేషన్ వార్‌హెడ్‌తో పెద్ద లక్ష్యాలపై దాడిచేస్తుంది. ఇనర్షియల్ నావిగేషన్, మిడ్–కోర్స్ డేటాలింక్, యాక్టివ్ రాడార్ హోమింగ్, లాఫ్టెడ్ ట్రాజెక్టరీ ద్వంద్వ–పల్స్ రాకెట్ మోటార్‌తో శత్రు రక్షణలను మోసం చేస్తుంది. Su–30MKI బార్స్ రాడార్ అప్‌గ్రేడ్‌తో 2–8 మిసైల్స్ మోసుకెళ్లవచ్చు.
కొనుగోలు వివరాలు..
సుమారు 300 మిసైల్స్‌కు 1.2 బిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకుంది. 12–18 నెలల్లో డెలివరీలు మొదలవుతుంది. అయితే రష్యా ఎగుమతి అనుమతి ఇచ్చినప్పటికీ అధికారిక ధ్రువీకరణ లేదు. లైసెన్స్ ఉత్పత్తి చర్చలు జరుగుతున్నాయి. 270 ఎస్‌యూ–30ఎంకేఐలలో 74 అప్‌గ్రేడెడ్ విమానాలకు ముందుగా అందిచనున్నారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యం
2025 మేలో పాక్‌లోని 9 ఉగ్రవాద క్యాంపులు ధ్వంసం చేసిన ఆపరేషన్ సింధూర్‌లో పాక్ J–10c, JF–17S PL–15 (145–250 కి.మీ.) క్షిపణులు భారత బీవీఆర్‌లోపాన్ని బహిర్గతం చేశాయి R–37M దీనికి తాత్కాలిక పరిష్కారంగా భావిస్తున్నారు. పాక్ ఎఫ్–16, AWACSలను గుర్తించకముందే కూల్చి రాడార్ నిఘా బలహీనపరుస్తుంది. చైనా జే–20, జే–16ల మద్దతు AWACలను LAC నుంచి బెదిరించి సెన్సార్ ఫ్యూజన్‌ను దెబ్బతీస్తుంది. ఇది శత్రు సహాయక విమానాలను దూరంగా తరలించి భారత ఆక్రమణలను సులభతరం చేస్తుంది.
దేశీయ ప్రత్యామ్నాయాలు
ఆస్ట్రా MK–1 (100 కి.మీ.) ఇప్పటికే సేవలో, MK–2 (240 కి.మీ., 2026 చివరి) డ్యూయల్–పల్స్ మోటార్‌తో, MKజ–3 ’గాంధీవ’ (350 కి.మీ., రామ్‌జెట్) 2026లో టెస్ట్ విజయం సాధించింది. R–37M తాత్కాలిక గ్యాప్ ఫిల్లర్‌గా, ఆత్మనిర్భర్ భారత్‌కు లైసెన్స్ ఉత్పత్తి మద్దతు.
ఈ డీల్ రష్యాతో భారత సంబంధాలను బలపరుస్తూ పాశ్చాత్య సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. పాక్ PL–17, J–35 స్టెల్త్ కొనుగోళ్లు వేగవతం చేయవచ్చు, కానీ ఆర్–37ఎం భారత వైమానిక యుద్ధ నియమాలను మార్చి దీర్ఘకాల స్వయం సమృద్ధి వైపు నడిపిస్తుంది.