Homeక్రీడలుShreyas Iyer: టీమ్ ఇండియాకు సారధి అయ్యే ముందు.. సర్పంచ్ సాబ్.. ఐపీఎల్ మొత్తాన్ని డామినేట్...

Shreyas Iyer: టీమ్ ఇండియాకు సారధి అయ్యే ముందు.. సర్పంచ్ సాబ్.. ఐపీఎల్ మొత్తాన్ని డామినేట్ చేస్తున్నాడు..

Shreyas Iyer: ఆ ఆటిట్యూడ్ మెంటల్ ఎక్కిస్తోంది. ఆ స్వాగ్ పిచ్చి లేపుతోంది. అభిమానులను అలరించే తీరు కిక్ ఎక్కిస్తోంది. నడిచే నడకలో రిధం.. వ్యూహాలు అమలు చేయడంలో పక్కా ప్రొఫెషనలిజం.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో సిసలైన మేనరిజం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అసలు ఇన్ని రోజులు ఈ టాలెంట్ ఎక్కడ దాచావు భయ్యా అనిపిస్తుంది.. ఇదంతా చూసిన తర్వాత.. పంజాబ్ అభిమానులు సర్పంచ్ సాబ్ అని ఎందుకు పిలుస్తున్నారో అర్థమైంది. డౌటే లేదు.. […]

Shreyas Iyer: ఆ ఆటిట్యూడ్ మెంటల్ ఎక్కిస్తోంది. ఆ స్వాగ్ పిచ్చి లేపుతోంది. అభిమానులను అలరించే తీరు కిక్ ఎక్కిస్తోంది. నడిచే నడకలో రిధం.. వ్యూహాలు అమలు చేయడంలో పక్కా ప్రొఫెషనలిజం.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో సిసలైన మేనరిజం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అసలు ఇన్ని రోజులు ఈ టాలెంట్ ఎక్కడ దాచావు భయ్యా అనిపిస్తుంది.. ఇదంతా చూసిన తర్వాత.. పంజాబ్ అభిమానులు సర్పంచ్ సాబ్ అని ఎందుకు పిలుస్తున్నారో అర్థమైంది.

డౌటే లేదు.. ఈ ఐపీఎల్లో పంజాబ్ జట్టు దాదాపుగా ఫైనల్ వెళ్లినట్టే. ఇప్పటివరకు పంజాబ్ జట్టును ఏ జట్టూ ఓడించలేదు. కనీసం ఓటమికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో పంజాబ్ జట్టు మిగతా జట్లకు అందనంత ఎత్తులో కనిపిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపిస్తున్న తీరు అద్భుతానికే అద్భుతం లాగా అనిపిస్తోంది. ఐపీఎల్ లో 300 లోడింగ్ ఘనతను హైదరాబాద్ జట్టు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాద్ జట్టుకంటే ముందు 250 + లోడింగ్ ఘనతను మాత్రం పంజాబ్ జట్టు అందుకుంది. లక్నో జట్టుకు చుక్కలు చూపించింది. అంతేకాదు బ్రహ్మాండమైన తేడాతో విజయాన్ని అందుకుంది.

లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసిన తర్వాత.. అద్భుతంగా బౌలింగ్ వేసి ఆ లక్ష్యాన్ని కాపాడుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ మీద చాలామంది అభిమానులకు రెస్పెక్ట్ పెరిగింది. త్వరలోనే అతడు టీమిండియా టి20, వన్డే ఫార్మాట్ కు సారధి కాబోతున్న నేపథ్యంలో.. అతడి గురించి మీడియాలో
.. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అయ్యర్ ఐపిఎల్ లో అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. సారధిగా 93 మ్యాచ్లు ఆడిన అతడు.. 55 మ్యాచ్లలో తన జట్టును గెలిపించాడు. 35 మ్యాచ్లలో ఓటమి పాలయ్యాడు. విన్నింగ్ పర్సంటేజ్ 59.13 గా కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో ధోనికి, రోహిత్ శర్మకు అద్భుతమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను అయ్యర్ కొనసాగించేలా కనిపిస్తున్నాడు. అన్ని అనుకూలిస్తే వారిద్దరిని కూడా దాటేసేలా ఉన్నాడు.

లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ అంతగా ఆకట్టుకోలేదు. కానీ నాయకుడిగా మాత్రం అతడు ఏ మాత్రం తగ్గలేదు. మైదానంలో ఎప్పటికప్పుడు ప్రణాళికలను మార్చాడు. వ్యూహాలను సరి చేసుకున్నాడు. బౌలింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. సరిగా వెయ్యలేకపోయిన బౌలర్లను పక్కన పెట్టలేదు. వాళ్లకు మళ్ళీ అవకాశాలు ఇచ్చాడు. వారి దగ్గర నుంచి నూటికి నూరు శాతం వచ్చేలా చూసుకున్నాడు. అందువల్లే లక్నో జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. తన జట్టుకు మరో విజయాన్ని అందించాడు. సర్పంచ్ సాబ్ అంటే.. పేరు మాత్రమే కాదని.. అది విజయాలకు చిరునామా అని నిరూపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper