Tennis Premier League Season -6 : పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కనిపించారు.. టెన్నిస్ కు వీడ్కోలు పలికిన తర్వాత వీరు ముగ్గురు ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. సానియా మీర్జా కు ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. లియాండర్ పేస్ వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందుల్లో ఉంది. మహేష్ భూపతిది కూడా ఇదే పరిస్థితి అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తిని కలిగించింది. బుధవారం ముంబై నగరంలో టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ -6 కు వేలం జరిగింది.. ఈ కార్యక్రమానికి శ్రాచి ఢిల్లీ రార్ టైగర్స్ జట్టుకు లియాండర్ పేస్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ హాజరైంది. ఈ కార్యక్రమంలో ఒకప్పటి బాలీవుడ్ భామ సోనాలి బింద్రే కూడా పాల్గొన్నది.. ఈ వేలంలో నాలుగు రౌండ్ల పాటు బిడ్డింగ్ ప్రక్రియ జరిగింది. పంజాబ్ పెట్రియాట్స్ జట్టు యజమాని ప్రియేష్ జైన్, బాలీవుడ్ నటి తాప్సీ పన్ను(మద్దతు ఇస్తోంది) కలిసి 22 సంవత్సరాల ఆర్మేనియన్ క్రీడాకారిణి ఎలీనా అవనేస్యన్ ను 42.20 లక్షలకు కొనుగోలు చేశారు. పురుషుల ప్లాటినం కేటగిరీలో అర్జున్ కాదేనిని రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. చివరి రౌండు వేళలో వ్యూహాత్మకంగా ముకుంద్ శశికుమార్ ను 6.80 లక్షలకు కొనుగోలు చేసింది.
అంబాసిడర్లుగా వీరే..
బెంగాల్ విజార్డ్స్ జట్టుకు అంబాసిడర్లుగా సానియా మీర్జా, హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టుకు రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహరిస్తున్నారు.. శ్రాచి ఢిల్లీ రార్ టైగర్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్లుగా లియాండర్ పేస్, చెన్నై స్మాషర్స్ జట్టుకు సోనాలి బింద్రే వ్యవహరిస్తున్నారు. ఇక బెంగళూరు ఎస్ జీ ఫైపర్స్ జట్టు గత ఏడాది టోర్నీలో విజయం సాధించింది. ఈసారి రెండుసార్లు గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ గెలిచిన ఆస్ట్రేలియన్ ఆటగాడు మాక్స్ పర్సెల్ ను కొనుగోలు చేసింది. అతడికి 42 లక్షలు వెచ్చించింది. ఒలింపియన్ అంకిత రైనా ను ఐదు లక్షల కొనుగోలు చేసింది. అనిరుద్ చంద్రశేఖర్ కు 4 లక్షలు వెచ్చించింది. వీరితో మిక్స్ డ్ డబుల్స్ ఆడించే అవకాశం ఉంది. ఈ జట్టుకు సీఈవోగా మహేష్ భూపతి కొనసాగుతున్నాడు. యజమానిగా రోహన్ గుప్త వ్యవహరిస్తున్నాడు.. ఇక బెంగాల్ జట్టు డబ్ల్యుటీఏ టూర్ లో రెండు సింగిల్స్ టైటిల్స్ సాధించిన క్రొయేషియా టెన్నిస్ స్టార్ పెట్రా మెట్రిక్ ను 35 లక్షలకు కొనుగోలు చేసింది. బెంగాల్ జట్టుకు యజమానిగా యతిని గుప్తే కొనసాగుతున్నాడు. ఈ జట్టు వెటరన్ స్టార్ శ్రీరాం బాలాజీని 6.2 లక్షలకు కొనుగోలు చేసింది. నికి పునాచా అనే క్రీడాకారిణిని 3.80 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఈ టోర్నీ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ సహకారంతో ముంబైలోని ఐకానిక్ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా లో మొదలవుతుంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 8 వరకు ఈ టోర్నీ సాగుతుంది.
గత సీజన్లో బెంగళూరు..
గత సీజన్లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. అయితే ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని ఆ జట్టు భావిస్తోంది. మిగతా జట్లు కూడా టోర్నీలో విజేతలుగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఖరీదైన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే మాజీ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా రాకతో టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సరికొత్త గ్లామర్ ను సంతరించుకుంది. మరోవైపు సినీ తారలు సోనాలి బింద్రే, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను వంటి వారు బ్రాండ్ అంబాసిడర్లు గా కొనసాగుతుండడంతో.. ఈ టోర్నీ పై అంచనాలు పెరిగాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More