Sania Mirza dating news: టెన్నిస్ ప్లేయర్ గా సానియా మీర్జా(Sania Mirza) అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం తరుపున ఎన్నో మ్యాచులు ఆడి మన దేశఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపజేసింది. సానియా మీర్జా అంటే ఒక బ్రాండ్. ఆమె ని ఆదర్శంగా తీసుకొని క్రీడారంగం లోకి వచ్చిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సానియా మీర్జా అప్పట్లో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్ తో ప్రేమాయణం నడిపి అతన్ని పెళ్లి చేసుకుంది. భారత మహిళ అయ్యుండి పాకిస్తాన్ ప్లేయర్ తో పెళ్లి చేసుకోవడం పై అప్పట్లో సానియా మీర్జా పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా నడిచాయి. అతనితో కొన్నాళ్ళు దాంపత్య జీవితాన్ని కొనసాగించి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రీసెంట్ గానే కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరు విడిపోవడం కూడా ఒక హాట్ టాపిక్. అయితే చాలా కాలం నుండి సానియా మీర్జా ఒకరితో డేటింగ్ చేస్తుందని సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్స్.
Also Read: శ్రీకాంత్ ఓదెల సినిమాను చిరంజీవి పక్కనపెట్టడా..?
మన టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ హీరో తో ఆమె ప్రేమాయణం నడుపుతుండట. ప్రస్తుతం వీళ్లిద్దరు హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉంటున్నారని, రీసెంట్ గానే ఒక ప్రైవేట్ పార్టీ లో వీళ్లిద్దరు కలిసి కనిపించడాన్ని బాలీవుడ్ మీడియా కూడా చూసిందని అంటున్నారు. మరి ఎవరు ఆ యంగ్ హీరో?, 38 ఏళ్ళ వయస్సున్న సానియా మీర్జా, యంగ్ హీరో తో డేటింగ్ ఎలా అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు. వీళ్లిద్దరి పరిచయం ఒక కాఫీ షాప్ లో జరిగిందట. అక్కడి నుండి మొదలైన వీళ్ళ పరిచయం, ప్రేమ గా మారి డేటింగ్ వరకు తీసుకెళ్లింది. ఈ ఏడాదిలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. సాధారణంగా రూమర్స్ పై స్పందించే అలవాటు ఉన్న సానియా మీర్జా, ఈ రూమర్ పై ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆమె రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.
Also Read: ‘కింగ్డమ్’ లో విజయ్ దేవరకొండ రియల్ స్టంట్స్ ఇలా ఉండబోతున్నాయా..?
ఈమధ్య కాలం లో ప్రముఖ సెలబ్రిటీలకు రెండవ పెళ్లి అనేది చాలా కామన్ అయిపోయింది. విడాకులు తీసుకున్న చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికీ సింగిల్ గానే మిగిలిపోయారు. కానీ కొంతమంది మాత్రం కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. గత ఏడాది నాగ చైతన్య కూడా ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత తో రెండవ పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ కూడా రీసెంట్ గానే రెండవ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక సమంత కూడా తక్కువేం కాదు, ఆమె ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో ప్రేమాయణం నడుపుతుంది. ఈ ఏడాదిలో ఏ క్షణం లో అయినా వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కొచ్చు. ఇప్పుడు వీళ్ళ జాబితాలోనే సానియా మీర్జా కూడా చేరబోతోంది.