Sania Mirza: భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఇటీవల విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. భర్త షోయబ్ మాలిక్ తో విడిపోయిన సానియా మీర్జా అధికారిక ప్రకటన అనంతరం ఆసక్తికర పోస్ట్ పెట్టింది. టెన్నిస్ లో సానియా మీర్జా అద్భుత విజయాలు సాధించారు. అంతర్జాతీయ వేదికలపై భారతీయ పతాకం రెపరెపలాడేలా చేసింది. అరుదైన విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. సానియా మీర్జా 2009లో సోహ్రబ్ మీర్జా అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అనుకోని కారణాలతో ఈ పెళ్లి రద్దు అయ్యింది.
అనంతరం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్ళికి సిద్ధమైంది. ఈ విషయంలో సానియా విమర్శల పాలైంది. శత్రు దేశమైన పాకిస్తాన్ క్రికెటర్ ని పెళ్లి చేసుకోవడం కొందరు తప్పుబట్టారు. అందులోనూ షోయబ్ కి ఇది రెండో వివాహం. 2010లో షోయబ్-సానియా మీర్జా వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ లో రాణించింది. షోయబ్-సానియాలకు ఒక అబ్బాయి సంతానం.
కొన్నాళ్లుగా షోయబ్, సానియా విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సానియా మీర్జా స్పందించలేదు. తాజాగా షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావేద్ తో పెళ్లి ప్రకటన చేశాడు. ఇది అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ క్రమంలో సానియా మీర్జా తరపున ఆమె చెల్లి అనం మీర్జా స్పందించారు. షోయబ్-సానియా మీర్జా కొన్ని నెలల క్రితమే విడిపోయారని ఆమె వెల్లడించారు. ఇప్పుడు విషయం బయట పెట్టుకుంటే సానియా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. తన వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అవుతుందని సానియా చెల్లి అన్నారు.
విడాకుల ప్రకటన తర్వాత సానియా మీర్జా ఓ పోస్ట్ పెట్టారు. అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుంటున్న ఫోటో షేర్ చేసిన సానియా ‘రిఫ్లెక్షన్’ అని కామెంట్ పెట్టారు. దాని అర్థం ప్రతిబింబం. అయితే లోతైన భావన ఏదో ఉందని పలువురు భావిస్తున్నారు. సానియా మీర్జా పోస్ట్ కి పలువురు నెటిజెన్స్ స్పందిస్తున్నారు. విడాకుల నేపథ్యంలో కొందరు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. సానియా మీర్జా పోస్ట్ వైరల్ అవుతుంది.
Web Title: Sania mirzas first post after divorce
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com