Royal Challengers Bengaluru: ఐపీఎల్ అంటేనే రిచ్ క్రికెట్ లీగ్. టికెట్ నుంచి మొదలుపెడితే ప్రసార హక్కుల వరకు ప్రతిదీ వందల కోట్ల వ్యాపారం. ఐపీఎల్ ప్రత్యేడాది తన స్థాయిని పెంచుకుంటుంది అంటే.. దానికి ప్రధాన కారణం అభిమానుల ఆదరణ. అందువల్లే ఈ టోర్నీ ప్రతి ఏడాది కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలలో క్రికెట్ కు విపరీతంగా ఆదరణ ఉంది. ఐపీఎల్ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందింది. ఐపీఎల్ తర్వాత అలాగే నిర్వహించాలని చాలావరకు దేశాలు ముందుకు వచ్చాయి. క్రికెట్ టోర్నీలను కూడా నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ఆటోర్నీలు ఐపీఎల్ మాదిరిగా విజయవంతం కాలేకపోతున్నాయి.
ఐపీఎల్ లో పది జట్లు ఉంటాయి. ఈ పదింట్లో ట్రోఫీ గెలిచిన జట్టుకు విలువ వేరే విధంగా ఉంటుంది. ఆ విలువ ఆధారంగానే ఆ జట్టు బ్రాండింగ్ ఆధారపడి ఉంటుంది. 2025లో బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో పంజాబ్ జట్టును మట్టి కల్పించింది. ఇక 2026లో కూడా బెంగళూరు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన పోరాటం చేసి.. గెలుపును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు విలువ అమాంతం పెరిగిపోయింది.
2026లో కూడా ఐపీఎల్ విజేతగా నిలవడంతో బెంగళూరు విలువ పెరిగిపోయింది. తద్వారా ప్రపంచ ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే 300 మిలియన్ల బ్రాండ్ వాల్యూ మార్పు చేరుకున్న తొలి క్రికెట్ జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ లెక్కలను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హులిహాన్ లోకి బయటపెట్టింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం బెంగుళూరు ప్రస్తుతం బ్రాండ్ విలువ 2,900 కోట్లు. ఐపీఎల్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ఫ్రాంచైజీలలో అత్యధిక విలువన జట్టుగా బెంగళూరు కొనసాగుతోంది.
ఈ జాబితాలో బెంగళూరు తర్వాత ముంబై ఇండియన్స్ ఉంది. ముంబై జట్టుకు 2526 కోట్ల విలువ ఉంది. తర్వాతి జాబితాలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కొనసాగుతోంది.. ఈ జట్టు మార్కెట్ విలువ 2344 కోట్లు. కోల్కతా తర్వాత స్థానంలో చెన్నై ఉంది. చెన్నై జట్టు విలువ 2335 కోట్లు. చెన్నై తర్వాత స్థానంలో హైదరాబాద్ కొనసాగుతోంది. హైదరాబాద్ జట్టు విలువ 1607 కోట్లు. హైదరాబాద్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఈ జట్టు విలువ 1540 కోట్లు. రాజస్థాన్ తర్వాత స్థానంలో పంజాబ్ ఉంది. పంజాబ్ జట్టు విలువ 1512 కోట్లు. పంజాబ్ తర్వాత స్థానంలో గుజరాత్ కొనసాగుతోంది.. గుజరాత్ మార్కెట్ విలువ 1502 కోట్లు. గుజరాత్ తర్వాత స్థానంలో ఢిల్లీ జట్టు ఉంది. ఢిల్లీ జట్టు విలువ 1492 కోట్లు. ఢిల్లీ తర్వాత స్థానంలో లక్నో జట్టు ఉంది. లక్నో జట్టు విలువ 1167 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఐపిఎల్ వ్యాల్యూ 20.6 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో చూసుకుంటే 1,97,024 కోట్లు.