Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma Net Worth 2026: రోహిత్ ను పక్కన పెట్టావు కదా గౌతమ్ గంభీర్.....

Rohit Sharma Net Worth 2026: రోహిత్ ను పక్కన పెట్టావు కదా గౌతమ్ గంభీర్.. అతడి వందలకోట్ల వైభవం చూడు

Rohit Sharma Net Worth 2026: టీమిండియాలో ధోని తర్వాత అత్యంత విజయవంతమైన సారధిగా రోహిత్ శర్మ పేరు తెచ్చుకున్నాడు. టీమిండియా కు ఛాంపియన్ ట్రోఫీ.. టీ20 వరల్డ్ కప్ అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి గనుక ఎదురు కాకుండా ఉండి ఉంటే.. వన్డే వరల్డ్ కప్ కూడా అందించేవాడు. ఇక అదే ఆస్ట్రేలియా చేతిలో పరాభవం ఎదురు కాకుండా ఉండి ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ కూడా అందించేవాడు. […]

Rohit Sharma Net Worth 2026: టీమిండియాలో ధోని తర్వాత అత్యంత విజయవంతమైన సారధిగా రోహిత్ శర్మ పేరు తెచ్చుకున్నాడు. టీమిండియా కు ఛాంపియన్ ట్రోఫీ.. టీ20 వరల్డ్ కప్ అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి గనుక ఎదురు కాకుండా ఉండి ఉంటే.. వన్డే వరల్డ్ కప్ కూడా అందించేవాడు. ఇక అదే ఆస్ట్రేలియా చేతిలో పరాభవం ఎదురు కాకుండా ఉండి ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ కూడా అందించేవాడు. ఆ రెండు వైఫల్యాలు రోహిత్ శర్మకు ఒక రకమైన ఇబ్బంది. స్థూలంగా చెప్పాలంటే జీవితకాల లోటు.

రోహిత్ మెరుగ్గానే ఆడుతున్నప్పటికీ.. సుదీర్ఘ ఫార్మేట్ లో వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. అతడిని టెస్ట్ జట్టు నుంచి పక్కన పెట్టారు.. మేనేజ్మెంట్ వ్యవహార శైలితో రోహిత్ శర్మ ఏకీభవించలేక.. ఆ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు. పొట్టి ఫార్మాట్ నుంచి కూడా అతడు పూర్తిగా వైదొలిగాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మేట్ లోనే అతడు కొనసాగుతున్నాడు. అది కూడా ఒక ఆటగాడిగా మాత్రమే.

పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ అద్భుతమైన ప్రతిభ చూపుతున్నప్పటికీ.. గౌతమ్ గంభీర్ ఏకపక్ష నిర్ణయం వల్ల రోహిత్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రోహిత్ ఏమాత్రం నిరాశ పడలేదు. ఒకరిపై నిందలు కూడా వేయలేదు. ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. అందువల్లే అనేక కంపెనీలకు అతడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

ఓ నివేదిక ప్రకారం రోహిత్ శర్మ గ్రౌండ్లో హిట్ మాన్.. బయట కూడా అదే స్థాయిలో జీవిస్తున్నాడు. అతడి నెట్ వర్త్ మొత్తం 214 కోట్ల వరకు ఉంటుంది. ఇతడు ముంబైలోని లగ్జరీ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇది అహుజా టవర్స్ లో ఉంది. ఇక్కడి నుంచి చూస్తే సి వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. అతని ఇంట్లో మోడ్రన్ ఇంటీరియర్.. పీస్ ఫుల్ గార్డెన్.. క్లాసి పూజ ఏరియా అద్భుతంగా కనిపిస్తోంది. ఆ ఇల్లు స్వర్గపురి మాదిరిగా తలపిస్తోంది. క్రికెట్ మాత్రమే కాకుండా.. అనేక కంపెనీలకు ప్రచారకర్తగా ఉండడంతో రోహిత్ శర్మకు బీభత్సంగా ఆదాయం లభిస్తుంది.. ఐపీఎల్ ద్వారా కూడా అతడు భారీగానే సంపాదిస్తున్నాడు. అందువల్లే ఈ స్థాయిలో తన ఆదాయాన్ని పెంచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper