spot_img
Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: గాయపడ్డ సింహం గర్జిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది..

Rohit Sharma: గాయపడ్డ సింహం గర్జిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది..

Rohit Sharma: ఇబ్బంది పెడుతున్న గాయాలు.. వరుసగా నాలుగు మ్యాచ్లకు దూరం.. అసలు ఆడతాడా? ఆడే అవకాశం ఉందా? మైదానంలో కనిపిస్తున్నాడు.. ప్రాక్టీస్ చేస్తున్నాడు.. డగ్ అవుట్ లో కూర్చుంటున్నాడు.. అసలు అతడి ఆరోగ్యం బాగానే ఉందా.. ఆరోగ్యం బాగానే ఉంటే. ఎందుకు ఆడటం లేదు.. ఇదిగో ఇలాగే సాగిపోతున్నాయి రోహిత్ శర్మ గురించి చర్చలు. సోషల్ మీడియాలో అయితే రోహిత్ గురించి ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది.

ముంబై జట్టుకు వరుసగా ఓటములు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంతగా ఆడక పోవడం.. అతడిలో వ్యూహాలు అంతగా లేకపోవడంతో.. ముంబై మేనేజ్మెంట్ అతడికి రెస్ట్ ఇచ్చింది. అతడి స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.. దీనికి తోడు రోహిత్ కూడా జట్టులోకి వచ్చాడు. ఇవన్నీ సానుకూలు అంశాలు అయితే.. బౌలింగ్ లోపం ముంబై జట్టును మరోసారి ఇబ్బంది పెట్టింది. దీంతో లక్నో జట్టు పండగ చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి, 228 పరుగులు సాధించింది. ఇది కొండంత లక్ష్యం కావడంతో.. ముంబై జట్టు గెలుపు పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఒక దశలో గూగుల్ ప్రేడిక్షన్ కూడా లక్నో జట్టుకు అనుకూలంగా ఉంది.

229 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ముంబై జట్టు ఏ దశలో కూడా ఓడిపోయినట్టు కనిపించలేదు. దీని అందరికి ప్రధాన కారణం రోహిత్ శర్మ. 44 బంతుల్లో 84 రన్స్ చేశాడు. ఇందులో ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆరు ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ రికెల్టన్ ఆడుతున్నప్పటికీ రోహిత్ దుమ్మురేపాడు. ఐదు మ్యాచ్లు మిస్ అయినప్పటికీ రోహిత్ (221) పరుగులతో ముంబై ఇండియన్స్ తరఫున మూడవ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ రెండుసార్లే 220+ పరుగులను చేజ్ చేసింది. ఆ రెండు సందర్భాల్లోనూ ముంబై జట్టును రోహిత్ ఆదుకున్నాడు. రికెల్టన్, రోహిత్ కలిసి తొలి వికెట్ కు 10.5 ఓవర్లలో 143 పరుగులు జోడించారు.. ఈ భాగస్వామ్యం ముంబై జట్టుకు తిరుగులేని బలాన్ని ఇచ్చింది. అందువల్లే ముంబై జట్టు విజయం సాధించింది.

తన ఫామ్ పై.. ఆరోగ్యంపై రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ వాటన్నిటికీ తన బ్యాటింగ్ ద్వారా సమాధానం చెప్పాడు. మైదానంలో చురుకుగా కదిలాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టాడు. బంతి కనబడితే చాలు స్టాండ్ అవతలికి పంపించాడు. గాయపడ్డ సింహం మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. తన గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో లక్నో ప్లేయర్లకు రుచి చూపించాడు. తద్వారా విమర్శకుల నోళ్లకు తాళాలు వేయించాడు రోహిత్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Divi Vadthya

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...
Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
Oktelugu Epaper