Homeక్రీడలుక్రికెట్‌Praful Hinge Saqib Hussain bowling performance: ప్రఫుల్, హుస్సేన్ కుమ్మేశారు.. హైదరాబాద్ బౌలింగ్ మారినట్టేనా..

Praful Hinge Saqib Hussain bowling performance: ప్రఫుల్, హుస్సేన్ కుమ్మేశారు.. హైదరాబాద్ బౌలింగ్ మారినట్టేనా..

Praful Hinge Saqib Hussain bowling performance: ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో హైదరాబాద్ బెంగళూరు తో తల పడింది.. 200కు పైగా పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది. హైదరాబాద్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. అప్పుడు మాత్రమే కాదు.. పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో కూడా 219 పరుగులు చేసి.. ఆ లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది. దీంతో హైదరాబాద్ జట్టు బౌలర్ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు రావడం మొదలైంది. సీనియర్ బౌలర్లు […]

Praful Hinge Saqib Hussain bowling performance: ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో హైదరాబాద్ బెంగళూరు తో తల పడింది.. 200కు పైగా పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది. హైదరాబాద్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. అప్పుడు మాత్రమే కాదు.. పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో కూడా 219 పరుగులు చేసి.. ఆ లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది. దీంతో హైదరాబాద్ జట్టు బౌలర్ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు రావడం మొదలైంది. సీనియర్ బౌలర్లు జయదేవ్, హర్షల్ దారుణంగా పరుగులు ఇస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ బౌలింగ్ మారదా.. హైదరాబాద్ బౌలర్లలో సమర్థత కరువైందా.. అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.

ఇన్నాళ్లకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించింది. జయదేవ్ ను పక్కన పెట్టిన యాజమాన్యం.. హర్షల్ పటేల్ విషయంలో కూడా అలానే చేసింది. మొత్తంగా వారిద్దరు రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యారు. వారి స్థానంలో ప్రఫుల్, హుస్సేన్ ను తీసుకుంది. వీరిపై కూడా పెద్దగా ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. వీరిద్దరూ అన్ క్యాప్డ్ ప్లేయర్లు. దీంతో వీరు రాజస్థాన్ బ్యాటర్ లను ఏ మేరకు నిలువరించగలరు.. అని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రఫుల్, హుస్సేన్ సత్తా చాటారు.

వీరిద్దరిని 30 లక్షలు చొప్పున కొనుగోలు చేసిన హైదరాబాద్ మేనేజ్మెంట్.. చివరికి వీరి వల్లనే బలమైన రాజస్థాన్ జట్టును ఓడించగలిగింది. ప్రఫుల్, హుస్సేన్ చెరి నాలుగు వికెట్లను సొంతం చేసుకున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు వీరిద్దరే సత్తా చూపించారు. రాజస్థాన్ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది.

బలమైన బెంగళూరును.. అంతకంటే పటిష్టమైన ముంబై జట్టును ఓడించి సంచలనం సృష్టించిన రాజస్థాన్ జట్టు.. హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్ ఈ స్థాయిలో ఆడేందుకు ప్రధాన కారణం కెప్టెన్ ఇషాన్ కిషన్. అతడు బ్యాటింగ్లో సత్తా చూపించాడు. బౌలింగ్లో ప్రఫుల్, హుస్సేన్ అదరగొట్టారు. ఫలితంగా రాజస్థాన్ జట్టు తొలి ఓటమి ఎదుర్కొంది.. కలిసికట్టుగా ఆడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో హైదరాబాద్ ఈ మ్యాచ్ ద్వారా నిరూపించింది.. అభిమానులకు ఇటీవల ఓటముల బాధ నుంచి సాంత్వన కలిగించింది.

ఇన్ని రోజుల వరకు హైదరాబాద్ జట్టు మీద.. ముఖ్యంగా బౌలింగ్ మీద విపరీతంగా విమర్శలు వచ్చేవి. వాటికి సమాధానం చెప్పుకోవడంలో హైదరాబాద్ మేనేజ్మెంట్ ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు ఆ ఇబ్బంది లేదు. ఆ ఇబ్బందిని ప్రఫుల్, హుస్సేన్ తీర్చేశారు. స్థూలంగా చెప్పాలంటే బలహీనంగా ఉన్న బౌలింగ్ మొత్తాన్ని బలంగా మార్చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper