Homeక్రీడలుక్రికెట్‌Santner reply to Pakistan journalist: పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. ఆ ఒక్క మాటతో పాక్...

Santner reply to Pakistan journalist: పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. ఆ ఒక్క మాటతో పాక్ పరువు తీసిన కివీస్ కెప్టెన్ శాంట్నర్

Santner reply to Pakistan journalist: సూపర్ 8 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించినప్పటికీ.. ఆ క్రికెట్ జట్టు పరువు పోతూనే ఉంది. పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు మాత్రమే కాదు.. ఇతర జట్ల ప్లేయర్లు కూడా ఆ జట్టు పరువు మొత్తం తీస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ పాకిస్తాన్ జట్టు పరువు తీశాడు. అంతర్జాతీయ సమాజం ముందు చులకన చేశాడు.

టి20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ జట్టును భారీ అంతరంతో ఓడించింది. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో న్యూజిలాండ్ కెప్టెన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ విలేకరులు ఆయనకు అనేక ప్రశ్నలు సంధించారు.” ఈ టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 383 పరుగులు చేశారు కదా. అలాంటప్పుడు అతడికి మెన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం ఇవ్వాలి కదా. అలాకాకుండా ఐసీసీ సంజు శాంసన్ కు ఆ పురస్కారం ఇచ్చింది కదా.. దానిని మీరు ఎలా సమర్థిస్తారు” అని న్యూజిలాండ్ కెప్టెన్ ను పాకిస్తాన్ జర్నలిస్టులు ప్రశ్నించారు.

దీనికి న్యూజిలాండ్ కెప్టెన్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు..”మీరు 383 పరుగులు చేసిన వ్యక్తి ఎవరు? అతడు ఎవరనేది ఇక్కడ అప్రస్తుతం. మెన్ అఫ్ ది సిరీస్ పురస్కారం ఇవ్వడానికి చాలా లెక్కలు ఉంటాయి. టీమిండియాలో సంజు శాంసన్ భీకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మంచి ఆటగాడు. ఇండియా జట్టుకు కీలకమైన సమయంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా మూడు మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు చేశాడు. అటువంటి వ్యక్తికి మెన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వాల్సిందే కదా. మెన్ అఫ్ ది సిరీస్ ఇవ్వడానికి అనేక రకాల విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. అందువల్లే అతనికి ఆ పురస్కారం అందించారు” అని న్యూజిలాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు.

వాస్తవానికి మెన్ అఫ్ ది సిరీస్ పురస్కారం ఇవ్వడానికి కేవలం ఎక్కువ పరుగులు చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. జట్టు విజయాలలో ఆటగాడు పోషించిన పాత్ర, అతడు సాధించిన పరుగులు లేదా తీసిన వికెట్లు.. మైదానంలో అతడు ఆడిన తీరు.. ప్రత్యర్థుల పై సాగించిన పరాక్రమం.. ఇలా ప్రతి అంశాన్ని ఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. అలా విషయాలకు అనుగుణంగా ఉన్న ఆటగాడికి మెన్ అఫ్ ది సిరీస్ పురస్కారం అందిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular