spot_img
Homeక్రీడలుPakistan Vs Canada: పసి కూన పై భయపడుతూ.. రెండు ఓటముల తర్వాత మొత్తానికి గెలిచేసింది..

Pakistan Vs Canada: పసి కూన పై భయపడుతూ.. రెండు ఓటముల తర్వాత మొత్తానికి గెలిచేసింది..

Pakistan Vs Canada: అమెరికాతో ఓడిపోయింది. భారత్ తో భంగపడింది.. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.. టోర్నీలో కచ్చితంగా కొనసాగాలంటే గెలవాల్సిన మ్యాచ్లో.. గెలిచింది.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్ లో కెనడాపై గెలిచి బోణి కొట్టింది.. కొడిగట్టిన సూపర్ -8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది దాయాది పాక్.. మహమ్మద్ అమీర్ (2/13), హరీస్ రౌఫ్(2/26) విజృంభించడంతో కెనడా 20 ఓవర్లలో 106/7 వరకే పరిమితమైంది. అరోన్ జాన్సన్(53; 53 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తో నిలబడటంతో ఆ మాత్రం టార్గెట్ నైనా పాక్ ముందు ఉంచింది.. ఇక 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.. కెప్టెన్ బాబర్ అజాం (33; 33 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

భారత్ నేర్పిన ఓటమితో భయం భయం..

ఇదే వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ గెలుపు వాకిట్లో బోల్తా పడింది. దానిని పునరావృతం చేయకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడింది. అందువల్లే లక్ష్య చేదనలో ఆచి తూచి ఆడింది. 4.1 ఓవర్ల వరకు పాకిస్తాన్ జట్టు స్కోరు 20 పరుగులు మాత్రమే అంటే.. ఆ జట్టు బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో ఓపెనర్ సహిం ఆయుబ్ (8) ను హెల్జర్ అవుట్ చేసి కెనడా శిబిరంలో ఆనందం నింపాడు. అయినప్పటికీ పాకిస్తాన్ భయపడలేదు. రిజ్వాన్, అజాం జాగ్రత్తగా ఆడారు. ఆరో వికెట్ వరకు ఒక బౌండరీ కూడా లేదంటే.. వారిద్దరి రక్షణాత్మక ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వారిద్దరు దూకుడు పెంచడంతో పాకిస్తాన్ 10 ఓవర్ల తర్వాత ఒక వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఇలానే సమయోచితంగా ఆడుతూ రిజ్వాన్- అజామ్ జోడి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.. ఈ దశలో అజామ్ ను హెలిజర్ అవుట్ చేశాడు. ఫకార్ ను బోర్డాన్ బోల్తా కొట్టించాడు. అప్పటికి పాకిస్తాన్ విజయ సమీకరణం 30 బంతులో 22 పరుగుల కు చేరుకుంది. మరో ఆటగాడు రిజ్వాన్ నిదానంగా ఆడి పని పూర్తి చేశాడు. ఫలితంగా 15 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ విజయం సాధించింది.

అంతకుముందు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కెనడా దూకుడుగా ఆడింది. 2.1 ఓవర్లలో ఏకంగా 20 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ అరోన్ జాన్సన్ తాను ఎదుర్కొన్న రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. ఈ దూకుడును కెనడా చివరి వరకు కొనసాగించలేకపోయింది. మరో ఓపెనర్ నవనీత్ నాలుగు పరుగులకే అవుట్ కావడంతో.. కెనడాకు కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ బౌలర్లు అమీర్, రౌఫ్ మెరుగ్గా బౌలింగ్ వేయడంతో కెనడా కోలుకోలేకపోయింది. ఈ దశలో వికెట్లు కోల్పోవడం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. మువ్వా శ్రేయస్ (2), రవీందర్ పాల్ (0) వంటి ఆటగాళ్లు నిరాశపరచడం, అది కెనడా స్కోర్ మీద ప్రభావం చూపించింది. మరోవైపు జాన్సన్ అర్థ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అతడు నసీం షా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో కెనడా ఆశలు మొత్తం అడుగంటాయి. అప్పటికి ఆ జట్టు ఆరు వికెట్లకు 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో కలీం సన (13*), హెలిజర్(9*) దూకుడుగా ఆడటంతో కెనడా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ విజయంతో గ్రూపులో రెండు పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానానికి చేరుకుంది. ఆడిన రెండు మ్యాచ్లు గెలిచి అమెరికా రెండవ స్థానంలో ఉంది. పాకిస్తాన్ గ్రూప్ -8 కు వెళ్లాలంటే భారత్ తో జరిగే మ్యాచ్లో అమెరికా చిత్తుగా ఓడిపోవాలి. పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు అమెరికా, పాకిస్తాన్ సమానస్థితిలో ఉంటాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సూపర్ -8 లోకి వెళ్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper