Ashish Nehra: చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో సరిపడినంత నెట్ బ్యాలెన్స్, ఊరించే సోషల్ మీడియా యాప్స్.. ఇంకేముంది ఒక్కొక్కడు ఒక్కో మార్తాండ్ కే వెంకటేష్.. అలా ఉంది వాళ్ల టాలెంట్.. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో ఆ ఆలోచనలు.. అసలు అలా ఎలా చేయాలనిపిస్తుందో.. అది బుర్రా లేకుంటే పాదరసమా అనిపిస్తుంది.. అంతటి వినూత్న ఆలోచనలు వస్తున్నాయంటే వాళ్లు మనుషులు కారు.. బాబోయ్.. ఈ కథనంలో కింద ఇచ్చిన లింక్ ఒక్కసారి క్లిక్ చేయండి.. మీకే అర్థమవుతుంది అసలు సంగతి.. పొరపాటున ఆ వీడియోను ఆశిష్ నెహ్రా చూసి ఉంటే దెబ్బకు మూర్చ పోతాడు.. ఆ వీడియో ఎడిటింగ్ చేసిన వారికి కచ్చితంగా ఏదో ఒక పురస్కారం ఇస్తాడు.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ఒకటి, రెండు జట్లు మినహా మిగతావన్నీ హోరాహోరిగా ప్రదర్శన చేస్తున్నాయి. అండర్ డాగ్ లాంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆటను రక్తి కట్టిస్తున్నారు. ప్రేక్షకులకు అసలు సిసలైన టి20 మజా అందిస్తున్నారు. ఇదే స్థాయిలో గనుక వారు తమ ఆట తీరును ప్రదర్శిస్తే.. 45 రోజులేం కర్మ.. సంవత్సరం మొత్తం ఐపీఎల్ నిర్వహించినా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు.. క్యాష్ రీచ్ లీగ్ లాంటి ఐపీఎల్ లో ఎన్నో వ్యవహారాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆయా జట్ల కోచ్ లు చేసే హడావిడి మాములుగా ఉండదు. అలాంటి హడావిడి కి పర్యాయపదం లాంటి వ్యక్తి ఆశిష్ నెహ్రా. ఒక దశాబ్దం క్రితం వరకు అతడు భారత జట్టులో కీలక బౌలర్ గా ఉండేవాడు. భారత జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఐపిఎల్ లో గుజరాత్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2022లో గుజరాత్ జట్టు ఛాంపియన్ గా అవతరించడంలో నెహ్రా కీలకపాత్ర పోషించాడు. గత సీజన్ లోనూ గుజరాత్ జట్టును తన వ్యూహాలతో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. చెన్నై జట్టు చేతిలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ ఓడిపోయింది గాని.. లేకుంటే కప్పు రెండవసారి దక్కించుకునేదే.
ప్రస్తుతం గుజరాత్ జట్టు ప్రయాణం పడుతూ, లేస్తూ సాగుతోంది. అయితే ఆ జట్టుకు సంబంధించి వ్యూహాలను అమలు చేయడంలో నెహ్రా తన బుర్రకు పదును పెడుతున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో కలియ తిరుగుతున్నాడు. ఆటగాళ్లతో మాట్లాడుతున్నాడు. చెవుల్లో గుసగుసలు చెబుతున్నాడు. ఫ్రిజ్ దగ్గర కూడా మైదానంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలో ఆటగాళ్లకు వివరిస్తున్నాడు. ఈ దృశ్యాలన్నింటితో ఓ నెటిజన్ అద్భుతమైన వీడియోను రూపొందించాడు. పైగా నెహ్ర హావాభావాలకు తగ్గట్టుగా అతడు తన ఓన్ కామెంట్రీ యాడ్ చేశాడు. అది పూర్తి తెలంగాణ స్లాంగ్ లో ఉండటంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియో 1.4 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 135 కే లైక్స్ సొంతం చేసుకుంది.. ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఏం తాగి ఇలా ఎడిట్ చేశావంటూ వీడియోను రూపొందించిన వ్యక్తిని కొనియాడుతున్నారు. ఈ వీడియోలో అన్నింటికంటే జీరో బల్బ్ తీసుకురా అనే మాటకు నెహ్రా పలికించిన హావాభావాలు పీక్స్ లెవెల్ లో ఉన్నాయి.. వీలుంటే మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి.. పడీ పడీ నవ్వుతారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Netizens are trolling gujarat team coach ashish nehra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com