Homeబిజినెస్UPI Payments: నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా యూపీఐ పేమెంట్స్‌ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?

UPI Payments: నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా యూపీఐ పేమెంట్స్‌ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?

UPI Payments: యూపీఐలు అందుబాటుకి వచ్చాక డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగాయి. చిన్న కిల్లీ కొట్టు నుంచి పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు చెల్లింపులు అన్నీ డిజిటల్‌ పద్ధతితోనే జరుగుతున్నాయి. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటే చాలు యూపీఐల ద్వారా పేమెంట్స్‌ క్షణాల్లో చేసేస్తున్నారు. అయితే ఒక్కోసారి యూపీఐ పేమెంట్స్‌ మొరాయిస్తుంటాయి. ఈ సమయంలో మన ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోవడం, లేదా.. బ్యాంకులో టెక్నికల్‌ సమస్యలు. ఈ రెండు కారణాలతోనే యూపిఐ చెల్లింపులు చేయలేకపోతాం. అయితే బ్యాంకు టెక్నికల్‌ ఇష్యూలు మన చేతులో లేవు. కానీ నెట్‌ బ్యాలెన్స్‌ మన చేతులోనే ఉంటుంది. అయితే నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా ఇప్పుడు పేమెంట్స్‌ చేయవచ్చు అదెలాగో తెలుసుకుందాం..

ఈ నంబర్లకు ఫోన్‌ చేస్తే చాలు..
= ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా యూపీఐ పేమెంట్స్‌ చేయాలంటే.. 080 4516 3666 లేదా 6366 200 200 లేదా 080 4516 3581 ఈ నంబర్లలో ఏదో ఒక నంబర్‌కు రిజిస్టర్‌ ఫోన్‌ నంబర్‌ నుంచి కాల్‌ చేయాలి.

= వెంటనే మీకు ఇలా వాయిస్‌ వస్తుంది. ‘‘ఇప్పుడు మీరు ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బులు పే చేయవచ్చు’’ అని చెబుతుంది.

= తర్వాత షాప్‌ కీపర్‌ ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని మీరు యూపీఐలో దానిని ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ఎంత చెల్లించాలో అంత డబ్బులను ఎంటర్‌ చేయాలి. తర్వాత యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయాలి.

= అంతే నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా యూపీఐ ద్వారా మీ ఖాతాలోని డబ్బులు షాప్‌ కీపర్‌ ఖాతాలో జమ అవుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular