New Home: కొత్త ఇంట్లోకి అడుగుపెడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఒకటికి రెండు సార్లు వాస్తుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వెళ్లాలి అంటారు వాస్తు నిపుణులు. అద్దె ఇంటికి వెళ్లినా, కొత్త ఇల్లు కట్టుకున్నా ఈ నియమాలు పాటించాలి అంటారు. మరి మీరు కూడా కొత్త ఇంటికి వెళ్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీలు తొలిగిపోతాయి.
పాత, పాడైన ఫర్నీచర్ ను కొత్త ఇంటికి తీసుకొని రావద్దు అంటారు నిపుణులు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. పాత వాటిని పాత ఇంట్లోనే వదిలి వెళ్లడం మంచిది. దీని వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. అంతేకాదు పగిలిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొని రావద్దు. దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆగ్నేయంలో వంటగది ఉండటం మంచిది. వంటకు వాడే ప్రతి వస్తువును ఒకే దిశలో ఏర్పాటు చేసుకోవాలి.
పాత ఇంట్లో కనుక పోర్టబుల్ పూజ గది ఉంటే చిన్న గుడి నమూనాను ముందుగా కొత్త ఇంటికి తీసుకొని వెళ్లి సరైన స్థలంలో పెట్టాలి. అంటే ఈశాన్యంలో పెట్టాలి. ఇక కొత్త ఇంటికి వెళ్లే ముందు పూజలు చేయడం మంచిది. పాజిటివ్ ఎనర్జీని పెంచి, నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
మంచాలకు ఎదురుగా అద్దాలను పెట్టవద్దు. పడుకున్నప్పుడు అద్దంలో చూడకూడదు. వాస్తుపరంగా మంచిది కాదు అంటారు నిపుణులు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే మంచాలకు ఎదురుగా అద్దాలను పెట్టవద్దు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఇల్లు బాగుంటుంది. అంతేకాదు మీరు కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత సంతోషంగా ఉంటారు.