spot_img
Homeక్రీడలుక్రికెట్‌Dhoni IPL 2026: ఈసారి మిస్ కాదు.. ధోని ఎల్లో జెర్సీ వేసేది ఇదే చివరి...

Dhoni IPL 2026: ఈసారి మిస్ కాదు.. ధోని ఎల్లో జెర్సీ వేసేది ఇదే చివరి సారి.. ఎందుకంటే?

Dhoni IPL 2026: గడచిన నాలుగు సంవత్సరాలుగా ఇదే వార్త. ధోని ఆడడు. ఆడలేడు. ఈ సీజన్ తో అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు.. వీడ్కోలు పలికిన తర్వాత చెన్నై జట్టుతో ఏదో ఒక రూపంలో తన ప్రయాణం కొనసాగిస్తాడు.. ఇదే తీరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిని ధోని ఇంతవరకు ఖండించలేదు. అలాగని స్వాగతించలేదు. చెన్నై మేనేజ్మెంట్ కూడా ధోని రిటర్మెంట్ పై ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. చర్విత చరణంలాగా ధోని రిటైర్మెంట్ కు సంబంధించిన వార్త ఏదో ఒక రూపంలో అటు మీడియాను.. ఇటు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

తాజాగా జాతీయ మీడియాలో కూడా ధోని రిటర్మెంట్ కు సంబంధించిన వార్త ఒకటి విపరీతంగా ప్రచారంలో ఉంది. అయితే ఇందులో చేసిన విశ్లేషణ మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ధోనీ వయసు 40+.. ఇంతటి వయసులో క్రికెట్ ఆడటం అంత సులభం కాదు. అది కూడా టి20 ఫార్మాట్ ఆడటం అంత ఈజీ కాదు. పైగా ధోని కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వెన్నెముక నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్లోనే అతడు వికెట్ల మధ్య పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో ధోని రిటైర్మెంట్ తప్పదని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ధోని పరోక్షంగా స్పందించాడు. తాను స్ట్రెచర్ మీద ఉన్నప్పటికీ కూడా చెన్నై యాజమాన్యం తీసుకొచ్చి.. క్రికెట్ ఆడిస్తుందని చమత్కరించాడు.

Also Read: విరాట్ దేశముదురు.. జట్టు నుంచి తొలగించండి.. అప్పుడే కథ మొదలైంది

అయితే ఇప్పుడు ధోని 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గైక్వాడ్ పూర్తి ఫిట్ గా ఉన్నాడు. అతడు ఈసారి జట్టును అత్యంత సమర్థవంతంగా నడిపించాలని బలమైన నిర్ణయంతో ఉన్నాడు. ప్లేయర్లు కూడా అదే స్థాయిలో కృత నిశ్చయంతో ఉండడంతో ఈసారి చెన్నై జట్టు ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే తనకు 40 కి మించిన వయసు ఉండడంతో ధోని ఇదే తన చివరి సీజన్ అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీనిపై కొన్ని జాతీయ మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఇంతవరకు ఈ విషయంపై ధోని అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే 2024లో సారధి మార్పును చెన్నై జట్టు చివరి వరకు ప్రకటించలేదు. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో చెన్నై జట్టు బరిలోకి దిగడానికి ముందు ధోని కీలక నిర్ణయాన్ని వెల్లడించాడు. సారధిగా తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు కూడా ధోని అటువంటి సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ధోని రిటైర్మెంట్ పై క్లారిటీ రావాలంటే.. మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper