spot_img
Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni backed Virat Kohli: విరాట్ దేశముదురు.. జట్టు నుంచి తొలగించండి.. అప్పుడే కథ...

MS Dhoni backed Virat Kohli: విరాట్ దేశముదురు.. జట్టు నుంచి తొలగించండి.. అప్పుడే కథ మొదలైంది

MS Dhoni backed Virat Kohli: ఒక బంగారం ఆభరణంగా తయారు కావాలంటే.. ఎన్నో దెబ్బలను ఎదుర్కోవాలి. భూమి నుంచి బంగారాన్ని సేకరించేటప్పుడు అనేక రకాల ప్రక్రియలను చేపడతారు. భూమిని తవ్వుతారు. రా గోల్డ్ ను సేకరిస్తారు. ఆ తర్వాత దానికి అనేక రకాల శుద్ధి ప్రక్రియలు చేపడుతారు. చివరికి అభరణంగా మారుస్తారు.

ఒకసారి ఆభరణం తయారయ్యిందంటే చాలు.. బంగారానికి విలువ పెరిగిపోతూ ఉంటుంది. మెరుస్తున్న బంగారాన్ని చూసి.. అందాన్ని ఇనుమడింపజేసే ఆభరణాన్ని చూసి చాలామంది తన్మయత్వం చెందుతుంటారు. బంగారం మాత్రమే కాదు.. ఒక మనిషి గొప్పగా అవతరించిన తర్వాత.. అతడికి ఉండే విలువ పెరిగిపోతూ ఉంటుంది. అప్పటిదాకా తిరస్కరించిన వారు.. తిట్టినవారు అతడిని పొగడుతుంటారు. విరాట్ కోహ్లీ జీవితంలో కూడా ఇటువంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి.

విరాట్ కోహ్లీ కెరియర్ ప్రారంభంలో భారీగా పరుగులు సాధించాడు. కొన్ని సందర్భాలలో తనమీద తాను నియంత్రణ కోల్పోయాడు. ప్రాక్టీస్ పక్కన పెట్టాడు. ఇష్టానుసారంగా వ్యవహరించాడు. పార్టీలంటూ తిరిగాడు. చివరికి జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇదేంటని కోచ్.. ఇతర వ్యక్తులు అడిగితే దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో నాటి క్రికెట్ పెద్దలు ఈ విషయాన్ని ధోని ఎదుట ప్రస్తావించారు. విరాట్ ను జట్టు నుంచి తొలగిద్దామని ప్రపోజల్ పెట్టారు. దానికి ధోని నవ్వి ఊరుకున్నాడు.

“విరాట్ మామూలు ఆటగాడు కాదు. అతడు జట్టుకు సంబంధించిన శక్తి. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. అతడు ఎలాగైనా ఆడతాడు. ఎలాంటి స్థితిలోనైనా ఆడతాడు. ఇప్పుడు కొంచెం బ్యాక్ డౌన్ అవ్వచ్చు. కానీ అతడు ఒకసారి రంగంలోకి దిగితే మ్యాచ్ స్వరూపం వేరే విధంగా ఉంటుంది. అతడిని జట్టు నుంచి తొలగించాలని ఆలోచన పక్కన పెట్టండి. అతని స్థాయి ఏమిటో నాకు తెలుసు. అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడకండి అంటూ” వారికి ధోని సమాధానం చెప్పాడు.

Also Read: IPL 2026: ఆ జట్ల కు కోలుకోలేని షాక్!

ధోని తన మీద ఉంచిన నమ్మకాన్ని గొప్పగా భావించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. కొన్ని సందర్భాలలో విఫలమైనప్పటికీ.. మెజారిటీ సందర్భాలలో మాత్రం జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడాడు. చేజింగ్ సమయంలో దుమ్ము రేపే బ్యాటింగ్ చేశాడు. రన్ మాస్టర్ గా అవతరించాడు. పరుగుల యంత్రంగా పేరు గడించాడు. చివరికి హైయెస్ట్ రన్ స్కోరర్ గా రికార్డ్ సృష్టించాడు. టి20లకు విరామం పలికినప్పటికీ.. టెస్టుల నుంచి విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం విరాట్ చిరుతపులి మాదిరిగా పరుగులు తీస్తున్నాడు.

విరాట్ కోహ్లీ ని జట్టు నుంచి తొలగించాలని ప్రతిపాదన రావడం.. దానికి ధోని వేరే విధంగా స్పందించడం.. వంటి పరిణామాలను గతంలో టీమిండియా కోచ్ గా పనిచేసిన ఎమ్మెస్ కే ప్రసాద్ పంచుకున్నారు. ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తద్వారా విరాట్ రేంజ్ ఏమిటో మరోసారి ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper