spot_img
Homeక్రీడలుక్రికెట్‌IPL 2026: ఆ జట్ల కు కోలుకోలేని షాక్!

IPL 2026: ఆ జట్ల కు కోలుకోలేని షాక్!

IPL 2026: ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈసారి అన్ని జట్లు ప్లేయర్ల విషయంలో జాగ్రత్త పాటించాయి. బౌలర్లు.. స్టార్ బ్యాటర్లు.. ఆల్ రౌండర్లను కొనుగోలు చేశాయి. ఫలితంగా ఈసారి పోటీ అత్యంత రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపించిన ప్లేయర్లకు ఈసారి అన్ని జట్లు అవకాశాలు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ లో విదేశీ ప్లేయర్లు కూడా సందడి చేస్తుంటారు. అయితే ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందుగానే భారీ అంచనాలు ఉన్న విదేశీ బౌలర్లు గాయపడ్డారు. దీంతో వారు ఏకంగా టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్ జట్టు తరఫున సామ్ కరణ్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్ అయిన ఇతడు.. గాయపడ్డాడు. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమవుతాడని తెలుస్తోంది. ఒకరకంగా రాజస్థాన్ జట్టుకు ఇది భారీ దెబ్బ.. కరణ్ ఇటీవల టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టాడు.. ఇంగ్లాండ్ జట్టు తరఫున మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు గాయపడడంతో రాజస్థాన్ జట్టు మెరుగైన ఆల్రౌండర్ ను కోల్పోయింది.

పంజాబ్ జట్టు కూడా ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది. పంజాబ్ జట్టు కు ఫెర్గు సన్ దూరమయ్యాడు. న్యూజిలాండ్ జాతీయ జట్టుకు చెందిన ఈ ఆటగాడు.. బౌలింగ్ తో పాటు.. బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఇతడికి ఎటువంటి గాయం కాకపోయినప్పటికీ.. ఇటీవల అతడు తండ్రి కావడం.. బిడ్డతో గడిపేందుకు స్వదేశానికి వెళ్ళాడు. దీంతో ప్రారంభంలో అతడు కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.

Also Read: ఫిదా చేశావురా బుడ్డోడా.. కమ్ బ్యాక్ అంటే ఇదీ..

ఇక బెంగళూరు జట్టు కు కోలుకోలేని దెబ్బ తగిలింది.. ఈ జట్టులో కీలకమైన బౌలర్గా ఉన్న హెజిల్ వుడ్ గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమైనట్టు తెలుస్తోంది. అతడు గత సీజన్లో అదరగొట్టాడు. బెంగళూరుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడు గాయపడిన నేపథ్యంలో.. బెంగళూరు బౌలింగ్ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారధిగా ఉన్న కమిన్స్ గాయపడ్డాడు. కొంతకాలంగా అతడు తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం అతడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. యాషెస్ సిరీస్ లో ఒకే మ్యాచ్ మాత్రమే ఆడాడు కమిన్స్. టి20 వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు దూరం మాత్రమే కాదు.. కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే హేజిల్ వుడ్, కమిన్స్ గాయపడిన నేపథ్యంలో.. వారు టోర్నీ మొత్తానికి దూరం కాలేదని.. కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడరని.. ఆ తర్వాత వారు ఆయా జట్లకు అందుబాటులోకి వస్తారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper