spot_img
Homeక్రీడలుక్రికెట్‌Smriti Mandhana net worth 2026: ఒకప్పుడు రెంట్ హౌస్ లో జీవితం.. ఇప్పుడు కోట్ల...

Smriti Mandhana net worth 2026: ఒకప్పుడు రెంట్ హౌస్ లో జీవితం.. ఇప్పుడు కోట్ల విలువైన విల్లాలు.. అంతకుమించి ఆస్తులు..

Smriti Mandhana net worth 2026: జీవితం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. ఈమె జీవితం కూడా అలాంటిదే. తోటి స్నేహితులు ఐటీ ఉద్యోగాలంటూ.. కార్పొరేట్ కొలువులు చేస్తున్నారు. ఈమె మాత్రం బ్యాట్ అంటూ.. బంతి అంటూ మైదానంలో కుస్తీ పట్టింది. కొన్ని సందర్భాలలో ఇబ్బంది పడింది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో తనకు తానే అనేకసార్లు ప్రశ్నించుకుంది. తనకు క్రికెట్ అవసరమా అని అనేక సందర్భాల్లో అనుకుంది. ఆ తర్వాత మైదానాన్ని చూడగానే తన ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయేది.. అలా తాను గొప్పగా ఎదగడానికి అనేక కష్టాలు పడింది. ఒకానొక సందర్భంలో తన కుటుంబం మహారాష్ట్రలోని సాంగ్లీలో అద్దె ఇంట్లో ఉండేది. తను ఎదిగిన తర్వాత.. మహిళ క్రికెటర్ గా రూపాంతరం చెందిన తర్వాత ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసుకుంది.

స్మృతి మందాన గురించి టీమ్ ఇండియా మహిళా క్రికెట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను వుమెన్ విరాట్ కోహ్లీగా పేరు తెచ్చుకున్నది.. డబ్ల్యూపీఎల్ లో బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తోంది. ఆల్రెడీ బెంగుళూరు జట్టును ఒకసారి విజేతగా నిలిపింది. బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్న స్మృతికి కోట్లలో నగదు లభిస్తోంది. ఇవి కాకుండా ఆమె అనేక ప్రైవేట్ కంపెనీలకు ప్రచారకర్తగా ఉంది. భారత మహిళా క్రికెట్లో ఆమెకు గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఉంది. ఇటీవల వన్డే వరల్డ్ కప్ లో భారత మహిళా జట్టును విజేతగా నిలపడంలో స్మృతి కీలక పాత్ర పోషించింది. తద్వారా ఆమె రేంజ్.. బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగింది.

పలాష్ తో వివాహం రద్దయినప్పటికీ.. అతడి ప్రేమ బూటకం అని తెలిసిన తర్వాత స్మృతి కొద్దిరోజులు నిరాశలో మునిగిపోయింది. ఆ తర్వాత తన నిస్పృహను మైదానంలోనే వదిలించుకుంది. మైదానాన్ని ఆసరాగా చేసుకుని తన పూర్వస్థితిని అందుకుంది. ఇప్పుడు స్మృతి టీమ్ ఇండియా మహిళా క్రికెట్లో ఒక అద్భుతమైన ప్లేయర్. అంతకుమించి కోట్లాదిమంది భారతీయ క్రికెట్ అభిమానులకు కలల యువరాణి. ఆమె ఓకే అంటే మూడు ముళ్ళు.. ఏడు అడుగులు వేయడానికి ఆజానుబాహుల లాంటి కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు.. అన్నట్టు స్మృతి ఒకప్పుడు తాను అద్దె ఇంట్లో ఉన్న సాంగ్లీ ప్రాంతంలో.. ఇప్పుడు విలువైన విల్లాలు కొనుగోలు చేసింది. అదే స్థాయిలో లగ్జరీ భవనాలను సొంతం చేసుకుంది.. ఎక్కడైతే తాను ఇబ్బంది పడిందో.. అక్కడే తలెత్తి నిలబడింది.

జీవితం చాలా మందికి చాలా అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవారు జీవితంలో స్థిరపడతారు. అందులో స్మృతి ముందు వరుసలో ఉంటుంది. తోటి స్నేహితులు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. భారీగా సంపాదిస్తున్నారు. కానీ వారికి మించిన సంపాదన స్మృతి దగ్గర ఉంది. ఇక ఆమెకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కష్టే ఫలి అంటారు. కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా రావచ్చు. కానీ మన కష్టానికి గుర్తింపు ఎప్పుడైనా లభిస్తుంది. అందుకు నిదర్శనమే స్మృతి.

 

View this post on Instagram

 

A post shared by Alok singh (@bollyalok)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper