Homeక్రీడలుJasprit Bumrah: బుమ్రా అరుదైన ఘనత.. టి20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు

Jasprit Bumrah: బుమ్రా అరుదైన ఘనత.. టి20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు

Jasprit Bumrah: టీమిండియా ఏస్ బౌలర్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు.

బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బుమ్రా ఆరో ఓవర్లో బంతిని అందుకున్నాడు.. ఆ ఓవర్ మొత్తం ఒక్క పరుగు ఇవ్వకుండా ఐర్లాండ్ బ్యాటరీలను కట్టడి చేశాడు.. టి20 మ్యాచ్లలో బుమ్రా కు ఇది 11వ మెయిడిన్ ఓవర్. గతంలో ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరు మీద ఉండేది. అయితే అతడి రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు..బుమ్రా 63 మ్యాచ్లలో.. 11 ఓవర్లను మెయిడిన్ గా వేశాడు. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్లలో 10 ఓవర్లను మెయిడిన్ గా వేశాడు ..

అయితే ఈ లిస్టులో ఉగాండా, కెన్యా బౌలర్లు మొదటి స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లు వేసి టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. కెన్యా బౌలర్ సోంగొచ్ 12 మెయి డిన్ ఓవర్లు వేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు . అయితే ఐసీసీ టాప్ 8 ర్యాంక్ లలో ఉన్న జట్లలో మెయిడిన్ వేసిన బౌలర్ గా బుమ్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా, బుధవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బుమ్రా (2/6) అదిరిపోయే బౌలింగ్ వేశాడు. నిప్పులు జరిగే బంతులు వేస్తూ ఐర్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు . మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ.. బంతుల నుంచి స్వింగ్ రాబట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఐర్లాండ్ బ్యాటర్లు కనీసం బంతిని టచ్ చేయాలంటేనే భయపడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper