spot_img
Homeక్రీడలుక్రికెట్‌Mukul Chaudhary: ఐపీఎల్ లో ఓవర్ నైట్ స్టార్.. ఇంతకీ ఎవరు ఈ ముకుల్ చౌదరి.....

Mukul Chaudhary: ఐపీఎల్ లో ఓవర్ నైట్ స్టార్.. ఇంతకీ ఎవరు ఈ ముకుల్ చౌదరి.. ఇదీ అతడి నేపథ్యం

Mukul Chaudhary: ఐపీఎల్ లో గురువారం జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో మ్యాచ్లో.. వీర విహారం చేశాడు ముకుల్ చౌదరి. ఓడే జట్టును గెలిపించి సంచలనం సృష్టించాడు.. 181 పరుగుల టార్గెట్ ఫినిష్ చేయడంలో.. ఒకానొక దశలో కోల్ కతా 128 పరుగులకే 7 వికెట్ల కోల్పోయింది. ఈ దశలో లక్నో జట్టు గెలుపు మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అదిగో అప్పుడు వచ్చాడు మైదానంలోకి ముకుల్ . ఇతడు కూడా అంతగా ఆడ లేడని.. గొప్పగా పరుగులు చెయ్యడని అందరూ అనుకున్నారు. లక్నో జట్టు యాజమాన్యానికి కూడా గెలుపు మీద పెద్దగా ఆశలు లేవు.

అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ముకుల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మైదానంలో వీర విహారం చేశాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొని.. 54 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఫోర్లు రెండు ఉంటే.. సిక్సర్లు 7 నమోదు కావడం విశేషం.. దీనిని బట్టి అతడు బ్యాటింగ్ ఎలా చేశాడో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి లక్నో జట్టుకు గెలుపు మీద ఆశలు లేని సమయంలో.. ముకుల్ స్థిరంగా నిలబడ్డాడు. అంతటి ఒత్తిడిని తట్టుకుంటూ.. గట్టిగా బ్యాటింగ్ చేశాడు. ఆవేష్ ఖాన్ కు ఏమాత్రం స్ట్రైక్ ఇవ్వకుండా.. తను మాత్రమే అంటిపెట్టుకొని.. పరుగులు చేశాడు. కనీసం కోల్ కతా బౌలర్లు అతడిని అవుట్ చేయకపోయినా పర్వాలేదు.. ఇబ్బంది పెట్టే బంతులు కూడా వేయలేకపోయారు.

ముకుల్ వీరోచితమైన బ్యాటింగ్ చేయడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ముకుల్ గురించి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.. ముకుల్ స్వస్థలం రాజస్థాన్లోని జున్ జును ప్రాంతం.. ఇతడు తండ్రి పేరు దిలీప్. అతడు ఒక టీచర్ గా పని పనిచేస్తున్నాడు. దిలీప్ కు క్రికెటర్ కావాలని ఉండేది. కానీ ఆ కల గానే మిగిలిపోయింది. దీంతో తనకు కొడుకు పుట్టకముందే.. దిలీప్ క్రికెటర్ ను చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ముకుల్ ను క్రికెట్ వైపు మళ్ళించాడు.

మొదట్లో ముకుల్ బౌలింగ్ చేసేవాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ అయ్యాడు.. బౌలర్ గా.. వికెట్ కీపర్ గా ముకుల్ అదరగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ వైపు వచ్చేసాడు. ఇటీవలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముకుల్ దుమ్మురేపాడు. ఐదు ఇన్నింగ్స్ లలో 198.86 స్ట్రైక్ రేట్ తో 173 పరుగులు చేశాడు. లక్నో జట్టు యాజమాన్యం ఇతడిని మెగా వేలంలో 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. అంత ధర అతనికి ఎందుకని చాలామంది అన్నారు. కానీ, తనకు వెచ్చించిన ధర సరైనదేనని ముకుల్ నిరూపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
Oktelugu Epaper