India Vs Sri Lanka Asia Cup 2025 Live: 41 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆసియా కప్ లో తొలిసారి పాకిస్తాన్, భారత్ ఫైనల్ వెళ్లిపోయాయి.. ఈ రెండు జట్లు ఆసియా కప్ లో తలపడుతున్న నేపథ్యంలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరిగా సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆసియా కప్ లో ఇప్పటికే పాకిస్తాన్, భారత్ పరస్పరం రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ , సూపర్ 4 లో రెండుసార్లు పోటీ పడగా.. రెండుసార్లు కూడా టీం ఇండియా విజయం సాధించింది. లీగ్ దశలో విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా సారధి సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అది కాస్త వివాదమైంది. దానిని మర్చిపోకముందే సూపర్ 4 పోరు లో పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ వివాదాస్పదమైన సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమయ్యాయి. ఏకంగా ఐసిసి దృష్టి కూడా వెళ్లడంతో సూర్యకుమార్ యాదవ్ కు, రౌఫ్ కు మ్యాచ్ ఫీజులో 30% కోతపడింది.
పాకిస్తాన్ జట్టు తో జరిగే ఫైనల్ మ్యాచ్లో అంచనాలు భారీగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ. ఎందుకంటే ప్రస్తుత ఆసియా కప్ లో అతడు భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే అతడు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మీద శివతాండవం చేశాడు. దీంతో ఫైనల్ మ్యాచ్లో కూడా అతడు అదే జోరు కొనసాగిస్తాడని.. తిరుగులేని స్థాయిలో పరుగులు సాధిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడు పాకిస్తాన్ ప్లేయర్లకు ఉ** పోయిస్తాడని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. మూత్ర విసర్జన చేసిన ఒక వ్యక్తి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ విజృంభిస్తే పాకిస్థాన్ పరిస్థితి ఇదేనని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.
Abhishek Sharma scored another 50s in this Aisa Cup.
Pakistanis right now :#INDvsSL pic.twitter.com/Sht29XL73P
— Vivek (@hailKohli18) September 26, 2025