MLA Anirudh Reddy On Aurobindo: వాస్తవానికి ఏ రాష్ట్రానికి అయినా సరే పరిశ్రమలు రావాలని అక్కడి ప్రభుత్వం కోరుకుంటుంది. పరిశ్రమల వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి. ఉపాధి పెరుగుతుంది. ప్రభుత్వాలకు దండిగా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ అలాంటిది ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఓ పరిశ్రమ మీద చిందులు తొక్కారు. అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అవసరమైతే ఆ ఫ్యాక్టరీని కాలబెడతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు.. చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా ముదిరెడ్డిపల్లి శివారు ప్రాంతంలో అరబిందో ఫ్యాక్టరీ ఉంది. ఈ సంస్థ ఇక్కడ ఔషధాలు తయారుచేస్తోంది. ఈ ఔషధాల తయారీ అనంతరం వ్యర్థజలాలను సమీపంలో ఉన్న రైతుల పొలాలలోకి డంప్ చేస్తోంది. యాజమాన్యం వ్యవహార శైలిపై అక్కడి రైతులు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలికి అనేక పర్యాయాలు ఫిర్యాదు చేశారు. ఇందులో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన అనేక సందర్భాలలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చర్యలు శూన్యం. దీంతో ఆయనలో ఓపిక నశించింది. ఫలితంగా నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఒక కీలక వీడియోను విడుదల చేశారు.
“నాకు ఓపిక నశించింది. రైతుల పొలాల్లోకి వ్యర్థజలాలను అరబిందో సంస్థ డంప్ చేస్తోంది. ఇది అక్కడి రైతుల పంట పొలాలను సర్వనాశనం చేస్తోంది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. రైతుల పంట పొలాలలో పంటలు సరిగా పండడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్ని సార్లు చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఓపిక నశించింది ఒక్కరోజులోనే అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు స్వయంగా తాను వెళ్లి అరబిందో ఫ్యాక్టరీని తగలబెడతానని” అనిరుద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
జడ్చర్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సంచలనంగా మారాయి. జడ్చర్ల ప్రాంతంలో అరవింద సంస్థ ఎప్పటినుంచో ఔషధాలు తయారు చేస్తోంది. ఈ ఔషధాల తయారీ వల్ల ఏర్పడిన వ్యర్ధ జలాలను రైతుల పొలాల్లోకి డంప్ చేస్తోంది. దీనిపై అక్కడి రైతులు ఎప్పటినుంచో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
Congress Jadcherla MLA Anirudh Reddy – to set Aurbindo Pharma at Polepally on fire by Sunday if they don’t stop releasing polluted water
Factory must correct its practices within a day or else, burning the factory on Sunday is guaranteed.
Alleged that the Pollution Board and… pic.twitter.com/YM67Z3acUH
— Naveena (@TheNaveena) September 26, 2025