India vs Sri Lanka Asia Cup 2025 Live: ఆసియా కప్ లో భాగంగా సూపర్ ఫోర్ లో టీమిండియా తన చివరి మ్యాచ్ శ్రీలంకతో ఆడుతోంది. ఈ మ్యాచ్లో భాగంగా టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన భీకరమైన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. మరో ఓపెనర్ గిల్(4) నాలుగు పరుగులు మాత్రమే చేసి తీక్షణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గిల్ సింగిల్ డిజిట్ కే ఔట్ కావడంతో శ్రీలంక జట్టులో ఆనందం వెల్లివిరిసింది. ఇదే సమయంలో భారత జట్టులో టెన్షన్ నెలకొంది. శ్రీలంక జట్టు ఏమైనా అద్భుతం చేస్తుందా అనే అనుమానం సగటు భారత అభిమానిలో కలిగింది. అయితే ఆ అనుమానాలను మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పటాపంచలు చేశాడు.
THE MADMAN OF INDIA
Abhishek Sharma steps out to a hard length and launches it straight down the ground!
Fearless cricket. Clean strike. Pure class. #AbhishekSharma #INDvsSL #AsiaCupT20 pic.twitter.com/d3xj66NpNJ— Asia Voice (@Asianewss) September 26, 2025
వరుసగా మూడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంక బౌలింగ్ మొత్తాన్ని చీల్చి చెత్తకుప్పలో పడేశాడు.. స్పిన్, పేస్ ఇలా ఏ బౌలర్ ని కూడా వదిలిపెట్టలేదు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏడు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉండడం విశేషం.. ఈ హాప్ సెంచరీ ద్వారా అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు..
25 కంటే తక్కువ బంతుల్లో ఆప్ సెంచరీ చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు అభిషేక్ శర్మ . ఆరుసార్లు 25 కంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. అతని కంటే ముందు స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో టీమిండియా టి20 మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ ఏకంగా ఏడుసార్లు 25 కంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాదు ప్రస్తుత సంవత్సరంలో ఏడుసార్లు t20 లలో 30 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు.. 2021 2022 సీజన్లో రోహిత్ శర్మ ఏడుసార్లు 30 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2021 సీజన్లో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ ఏడుసార్లు 30 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనతను తన పేరు మీద రాసుకున్నాడు. ఇక ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా 7 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 74 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 54*, తిలక్ వర్మ 0* క్రీజ్ లో ఉన్నారు.
Abhishek Sharma brings up yet another 5️⃣0️⃣, off 22 balls
His 3rd in a row and 5th in T20Is
Updates ▶️ https://t.co/xmvjWCaN8L#TeamIndia | #AsiaCup2025 | #Super4 | #INDvSL | @IamAbhiSharma4 pic.twitter.com/6uAbGn6V02
— BCCI (@BCCI) September 26, 2025