Homeక్రీడలుక్రికెట్‌India Vs Pakistan T20 World Cup 2026: ఉస్మాన్ తారిఖ్ కు.. సూర్య సేన...

India Vs Pakistan T20 World Cup 2026: ఉస్మాన్ తారిఖ్ కు.. సూర్య సేన చెక్ పెట్టాలంటే.. ఏం చేయాలో తెలుసా?

India Vs Pakistan T20 World Cup 2026: ఉత్కంఠ.. చర్చల తర్వాత టీమిండియా, పాకిస్తాన్ తల పడుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో.. ఉస్మాన్ తారిఖ్ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇతడు ఆడింది కేవలం నాలుగు అంతర్జాతీయ టీ 20 క్రికెట్ మ్యాచ్లు మాత్రమే. ఇతడి వయసు 28 సంవత్సరాలు. ఇతడు వేస్తున్న బౌలింగ్ ప్రస్తుతం […]

India Vs Pakistan T20 World Cup 2026: ఉత్కంఠ.. చర్చల తర్వాత టీమిండియా, పాకిస్తాన్ తల పడుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో.. ఉస్మాన్ తారిఖ్ గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇతడు ఆడింది కేవలం నాలుగు అంతర్జాతీయ టీ 20 క్రికెట్ మ్యాచ్లు మాత్రమే. ఇతడి వయసు 28 సంవత్సరాలు. ఇతడు వేస్తున్న బౌలింగ్ ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ చాలా చిత్రంగా ఉంటుంది. ఇటీవల ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ ఇతడి బౌలింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని బౌలింగ్ యాక్షన్ ను ఐసీసీ పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నాడు.

ఉస్మాన్ తారిఖ్ బంతిని విసిరే క్రమంలో తనదైన వేగాన్ని ప్రదర్శిస్తాడు. మలింగ, బుమ్రా, పతిరణ, పాల్ ఆడమ్స్, కేశవ్ జాదవ్, సోహైల్ తన్వీర్ వంటి బౌలర్లు భిన్నంగా బౌలింగ్ చేస్తుంటారు. కానీ ఉస్మాన్ మాత్రం చిత్రమైన బౌలింగ్ వేస్తూ ఉంటాడు. అతడు బంతిని పట్టుకొని వేగంగా వస్తాడు. ఆ తర్వాత ఒక క్షణం టైం తీసుకుని బంతిని విసిరేస్తుంటాడు.

ఇతడి బౌలింగ్ గురించి ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఆయనప్పటికీ అతని గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇతడి బౌలింగ్ గురించి వివాదాలు రావడానికి ప్రధాన కారణం.. ఉస్మాన్ బంతివేసే క్రమంలో ఆగిపోతాడు. ఆ తర్వాత బంతిని విసిరేస్తుంటాడు. దీంతో క్రీజ్ లో బ్యాటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఉస్మాన్ బౌలింగ్ పై ఇప్పటికే ఇషాన్ కిషన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “బౌలర్ ఎవరనేది కాదు. మేము బ్యాటింగ్ ఏ స్థాయిలో చేస్తామనేది ఇక్కడ ఇంపార్టెంట్. మేము మా సామర్థ్యం మీద గట్టి నమ్మకంతో ఉన్నాం. అలాంటప్పుడు ఎవరూ మమ్మల్ని ప్రభావితం చేయలేరని” కిషన్ పేర్కొన్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఉస్మాన్ ఒకసారిగా సంచలన వ్యక్తిగా మారిపోయాడు. సోషల్ మీడియాలో ఇతర గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇతడి బౌలింగ్లో కనుక టీమిండియా అదరగొడితే తిరుగు ఉండదు. అన్నట్టు టీమ్ ఇండియా బ్యాటర్లు తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు విపరీతమైన ఆసక్తిని కలగజేస్తున్నాయి

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper