India vs New Zealand 2nd T20I: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఒక దశలో ఓటమి తప్పదనిపించింది. జట్టు ను ఓటమి నుంచి తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి గెలిపించారు. తమ అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్ మొత్తాన్ని భారత్ వైపు తిప్పారు. మరో విశేషం ఏంటంటే ఈ ఇద్దరు తెలుగు క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తెలుగులో మాట్లాడిన మాటలు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
న్యూజిలాండ్ భారీ స్కోరు
న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓర్లలో ఐదు వికెట్లకు 180 పరుగులు చేసింది. ఫిలిప్స్ 70 పరుగులు చేశాడు. జాకబ్స్ 58 పరుగులతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
ఒక్కసారిగా కష్టాల్లో
181 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత జట్టుకు మధ్యభాలలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 40 పరుగుల దాకా ఒక్క వికెట్ కోల్పోకుండా ఉన్న భారత జట్టు.. 112 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయింది. న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ నాలుగు టికెట్లు పడగొట్టాడు. భారత జట్టును ఇబ్బందులు పెట్టాడు.
నమన్ అదిరిపోయే బ్యాటింగ్
నమన్ దీర్ 17 బంతుల్లో 31 పరుగులు చేసే అదరగొట్టాడు. భారత జట్టుకు కీలకమైన ఊపు ఇచ్చాడు. అయితే ఇతడు అవుట్ అయ్యేసరికి మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. జట్టును గెలిపించాల్సిన బాధ్యత తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి మీద పడింది.
తెలుగు జోడి అద్భుతం
చివరి దశలో ఈ ఇద్దరు ఒత్తిడి అధిగమించి అదరగొట్టారు. 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా భారత్ 19.5 ఓవర్లలో ఒక బంతి మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి.. 181 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో కూడా టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం.
తిలక్ వర్మ మ్యాచ్ విన్నర్
కీలక సమయంలో తిలక్ వర్మ వికెట్ కాపాడుకుంటూ వేగంగా పరుగులు చేశాడు. భాగస్వామ్యంతో పాటు.. అద్భుతమైన బ్యాటింగ్ కూడా అవసరమని భావించాడు . తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ.. జట్టును విజయానికి చేరువచేసాడు. ఫలితంగా అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తిలక్ వర్మ 26 బంతుల్లో 51* పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మకు అండగా నిలుస్తూనే వేగంగా పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు తీసి భారత జట్టుకు విజయం అందించాడు. తిలక్ వర్ణం మీద న్యూజిలాండ్ బౌలర్ల నుంచి ఒత్తిడి తగ్గించడంలో ఇతడు సహాయపడ్డాడు. ఈ ఇద్దరి మధ్య ఏడో వికెట్ కు 69 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదయింది. కేవలం 30 బంతులలోనే ఈ పరుగులు రావడం విశేషం.
తెలుగులో మాట్లాడుకున్నారు
మ్యాచ్ సమయంలో స్టంప్ మైక్ లో వీరిద్దరూ తెలుగులో మాట్లాడుకున్నట్టు అభిమానులు గుర్తించారు. ముఖ్యంగా సింగిల్.. డబుల్ పరుగులు తీసే సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీకోసమే చూస్తున్న.. రన్ అంటే ముందే చెప్పాలి కదా” తిలక్ వర్మ మాట్లాడిన ఈ మాట సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.
– Chasing 181 runs.
– 70/5(10.5) at one stage.
– Naman, Tilak, Nitish.THE YOUNG TRIO HAS DONE IT IN NEW ZEALAND – Remarkable chase, What a finish under huge pressure, The T20 World Cup champions ❤️ https://t.co/ckKCHDuwBe
— Johns. (@CricCrazyJohns) October 24, 2026