Tilak Varma Nitish Kumar Reddy: క్రికెట్ మైదానంలో ఇద్దరు తెలుగు ఆటగాళ్లు తమ ఆటతోనే కాదు.. మాతృభాషలో మాట్లాడుకుంటూ కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్ లో తిలక్ వర్మ.. అన్నితీష్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన సరదా సంభాషణ ఎప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నది. మ్యాచ్ ఉత్కంఠ గా సాగుతున్న సమయంలో పరుగుల కోసం ఒకరిని ఒకరు పిలుచుకుంటూ ఈ ఇద్దరు తెలుగులో మాట్లాడుకున్నారు. స్టంట్ మైక్ లో వీరిద్దరి మాటలు రికార్డు అయ్యాయి.
రేయ్ రెండు అని చెప్పురా పోనీ
పరుగుల కోసం పిలిచే క్రమంలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటున్నది.
తిలక్ వర్మ: “నువ్వు కాల్ ఇవ్వలేదు” అని అనగా, నితీష్ కుమార్ రెడ్డి ” నువ్వు వచ్చేసేయ్. నేను వచ్చేస్తా ఆరాం సే” అంటూ సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మాటలు స్టంప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత తిలక్ వర్మ ” రేయ్ రెండు అని చెప్పురా పోనీ” అని అనడం మరింత సరదాగా అనిపిస్తోంది. మైదానంలో పరుగుల కోసం ఇద్దరూ ఎంత సమన్వయంతో వ్యవహరించాలో ఈ చిన్న సంభాషణ తెలియజేస్తోంది.
అంతర్జాతీయ వేదికపై
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ఆటగాళ్లు సాధారణంగా ఇంగ్లీష్ లేదా తమకు అనుకూలమైన భాషలో మాట్లాడుతుంటారు. అలాంటిది భారత జట్టుకు ప్రాథమితీయ వహిస్తున్న ఇద్దరు తెలుగు క్రికెటర్లు మైదానంలో తమ మాతృభాషలో మాట్లాడుకోవడం తెలుగు అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తోంది.
మ్యాచ్ లో ప్రతి పరుగు కీలకమైన సమయంలో కూడా తమ సహజమైన సంభాషణతో సమన్వయం చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఆటలో ఒత్తిడి ఎంత ఉన్నా.. సహచర ఆటగాళ్ల మధ్య ఉండే సాన్నిహిత్యం ఇలాంటి చిన్న క్షణాల్లో బయటపడుతుందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆటలో పోరాటం.. మాటలో తెలుగు మాధుర్యం
మైదానంలో ప్రత్యర్థి జట్టుతో పోరాడుతూనే.. తమ మధ్య జరిగే సంభాషణలో తెలుగు ప్రాధాన్యం ఇచ్చి నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ లో నిలిచారు. వీరిద్దరూ మాట్లాడుకున్న తీరు.. వికెట్ల మధ్య పరుగులు పెట్టిన తీరు అద్భుతంగా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఓడిపోయే మ్యాచ్ ను వీరిద్దరూ గెలిపించారు. వికెట్ ను కాపాడుకుంటూ.. పరుగులు చేశారు. తిలక్ వర్మ 26 బంతుల్లో 51* రన్స్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఏడో వికెట్ కు 69* పరుగులు చేశారు.
తిలక్ – నువ్వు కాల్ ఇవ్వలేదు
నితీష్ – నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసేతిలక్ – రేయ్ రెండు అని చెప్పురా పోనీ
ఎంత బాగుందో
ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే https://t.co/pkhzaiWJXZ— పల్నాడు పెద్దిరెడ్డి (@MrHyperReddy) October 24, 2026