India U19 Cricket Team: న్యూటన్ మూడో సూత్రం చెబుతున్నది ఒకటే. ప్రతి చర్యకు సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు భారత్ అండర్ 19 క్రికెట్ జట్టు కూడా ఇదే సూత్రాన్ని గుర్తు చేసింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత యువ ఆటగాలు సాధించిన విజయం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది.
భారత్.. పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎప్పుడు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ అండర్ 19 స్థాయి పోటీ అయితే యువ ఆటగాళ్లలో ఉండే ఉత్సాహం.. ఆవేశం మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఆసియా కప్ టోర్నీ లోనూ అదే జరిగింది. టోర్నీ లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో భారత జట్టుకు పరాజయం ఎదురైంది. ఇది యువ ఆటగాళ్లలో నిరాశ కలిగించింది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. భారత డ్రెస్సింగ్ రూమ్ వద్ద పాకిస్తాన్ ప్లేయర్లు దురుసుగా ప్రవర్తించారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 14న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు.. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 50 ఓవర్లలో 337 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో ఆకట్టుకున్నాడు. అబ్దుల్ ఖాదీర్ 80 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులతో ఆకట్టుకున్నాడు.
338 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత జట్టు ఒక దశలో ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. వికెట్లు వేగంగా పడిపోయాయి. దీంతో ఇండియన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. 252 పరుగులకే భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు విజయం దాదాపుగా అసాధ్యంగా కనిపించింది. కానీ ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. మనల్ చౌహన్.. మోహిత్ ఉల్వ అద్భుతమైన పోరాటం చేశారు. తొమ్మిదో వికెట్ కు 57 పరుగులు జోడించారు. భారత జట్టును విజయానికి చేరువ చేశారు. చౌహాన్ 47 పరుగులు చేయగా.. ఉల్వ 26 బంతుల్లో 49* పరుగులు చేశాడు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో ఉల్వ బౌండరీ కొట్టాడు. దీంతో భారత జట్టులో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఓడించిన భారత్ అండర్ 19 ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. ఇది భారత జట్టుకు తొమ్మిదవ అండర్ 19 ఆసియా కప్ టైటిల్.
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా చర్చకు దారితీసాయి. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జత సమీపంలో తీవ్ర ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. కొందరు ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్ల వైపు దూసుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఏది ఏమైనప్పటికి భారత జట్టు సాధించిన విజయం మామూలుది కాదు. ఓటమి అంచల నుంచి తిరిగి వచ్చి.. చివరి బంతికి విజయం అందుకోవడం అసాధారణమైనది. పాకిస్తాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆసియా క పండుకోవడం భారత యువ ఆటగాళ్ల పోరాట పటిమకు నిదర్శనం. న్యూటన్ మూడవ సూచన ప్రకారం ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. క్రికెట్లో ప్రత్యర్థికి ఇచ్చే అత్యుత్తమ సమాధానం మాటలతో కాదు.. ఆటతోనే.. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత యువ జట్టు సాధించిన విజయం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
NEWTON’S 3RD LAW is REAL
– Pakistan U19 showed unnecessary aggression in front of India’s dressing room after beating in the league match.
– Now, India U19 have answered them in their own words after winning the final. https://t.co/Qr4l7Xehc1
— Mukku (@Cric_Mukku) November 14, 2026