Homeక్రీడలుక్రికెట్‌Narendra Modi Stadium: ఇలా జరిగితే దరిద్రమైన మోడీ స్టేడియం అని ఎందుకు అనరు భయ్యా!

Narendra Modi Stadium: ఇలా జరిగితే దరిద్రమైన మోడీ స్టేడియం అని ఎందుకు అనరు భయ్యా!

Narendra Modi Stadium: అది 2023 వన్డే వరల్డ్ కప్. లీగ్ దశ నుంచి మొదలు పెడితే సెమీఫైనల్ వరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చింది. బలమైన ఆస్ట్రేలియాను.. పాకిస్తాన్ ను.. న్యూజిలాండ్ ను.. ఓడించుకుంటూ వచ్చింది. దర్జాగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

2011 తర్వాత టీమ్ ఇండియా మరోసారి వన్డే వరల్డ్ కప్ సాధించడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఒత్తిడికి గురైంది.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగింది. నాటి మ్యాచ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఓటమి తర్వాత టీమిండియా ప్లేయర్లు విపరీతంగా ఏడ్చారు. వాస్తవానికి ఈ ఫైనల్ మ్యాచ్ గనుక ముంబై లేదా ఇతర మైదానాల్లో నిర్వహించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని.. టీమిండియా గెలిచేదని అప్పట్లో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. చివరికి కాంగ్రెస్ నాయకులు కూడా బిజెపిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు.

ఇక తాజాగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ కూడా అదే వేదికగా జరిగింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత భారత్ చేతులెత్తేసింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి ఇబ్బంది పడింది. చివరికి చేంజింగ్ లో సైతం టీమిండియా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పిచ్ రూపొందించిన తీరు పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

సాధారణంగా మనదేశంలో క్రికెట్ మైదానాలు ప్లాట్ గా ఉంటాయి. కానీ, అహ్మదాబాద్ మైదానం పూర్తి విభిన్నంగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకు కాకుండా.. వికెట్లు లేదా ప్యాడ్ల వైపు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పరుగులు తీయడం ఆటగాళ్లకు సాధ్యం కాదు. ఇలాంటప్పుడే అనవసరమైన షాట్ లు కొట్టడానికి ప్లేయర్లు ప్రయత్నిస్తారు. చివరికి అవుట్ అవుతారు. అహ్మదాబాద్ మైదానంలో 2023 వన్డే వరల్డ్ కప్.. 2026 t20 వరల్డ్ కప్ లో టీం ఇండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో 2026 t20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ మైదానంలో నిర్వహించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు మేనేజ్మెంట్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ కాకుండా వేరే మైదానం మీద ఫైనల్ మ్యాచ్ నిర్వహించాల్సి ఉండేదని.. ఎవరో ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ మ్యాచ్ నిర్వహిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular